Cobra Trailer Review అదిరిపోయే గెటప్స్ చియాన్ విక్రమ్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ (వీడియో)
చియాన్ విక్రమ్ నటించిన థ్రిల్లర్ చిత్రం కోబ్రా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 31న రిలీజ్ అవుతున్నది. సెవెన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను ఆగస్టు 26వ తేదీన రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తున్నది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే..

మ్యాథమేటిక్ టీచర్‌గా
కోబ్రా చిత్రంలో విక్రమ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నను సాల్వ్ చేసే మ్యాథమెటిక్ జీనియస్ పాత్రలో కనిపించబోతున్నాడు. శత్రువులను వేటాడేందుకు రకరకాల గెటప్స్‌లో చిత్ర విచిత్రంగా కనిపించడం విశేషంగా మారింది. వివిధ అవతారాల్లో పలు దేశాల్లో నేరాలకు పాల్పడే మ్యాథమెటీషియన్‌గా ట్రైలర్‌లో కనిపించాడు.

క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పోలీస్ ఆఫీసర్‌గా
కోబ్రా చిత్రంలో ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించడం విశేషంగా మారింది. కోబ్రా కోసం వేటాడే పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. పలు సన్నివేశాల్లో ఇర్ఫాన్ పఠాన్ బాడీ లాంగ్వేజ్.. హావభావాలు మరింత ఆసక్తిని కలిగించాయి. ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది.

కేజీఎఫ్ భామ హీరోయిన్‌గా
ఇక కేజీఎఫ్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న శ్రీనిధి శెట్టి విక్రమ్ ప్రియురాలిగా కనిపించబోతున్నది. ఇంకా ఈ చిత్రంలో మియా జార్జ్, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి, సర్పెట్టా జాన్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. రోషన్ మ్యాథ్యూ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

పవర్ యాక్షన్ ఎపిసోడ్స్
కోబ్రా చిత్రంలో పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన సన్నివేశాలు బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని కలిగించే అవకాశం ఉంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫి మరో రేంజ్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్నది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మ్యాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు
రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
డిస్ట్రిబ్యూషన్: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్)
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
డీవోపీ: హరీష్ కన్నన్
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2022-08-31


Click it and Unblock the Notifications











