బ్లాక్‌లో వేలు,లక్షల్లో టికెట్లు ధర..దేవర అడ్వాన్స్ బుకింగ్ కాదు..బుక్ మై షో క్రాష్ తర్వాత పరిస్థితి దారుణంగా

భారతీయ సంగీత అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాక్ బ్యాండ్ షో కోల్డ్ ప్లే. ఈ మ్యూజిక్ ఈవెంట్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా, అభిమానులు పోటెత్తడంతో ఆన్ లైన్ టికెటింగ్ వెబ్ సైట్ క్రాష్ అయింది. దాంతో కోల్డ్ బ్యాండ్ షో వార్తల్లో నిలువడమే కాకుండా ట్రెండింగ్‌గా మారింది.

మ్యూజిక్ వరల్డ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ఈ బ్యాండ్ .. మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్ వరల్డ్ టూర్ పేరుతో ప్రపంచ యాత్ర చేస్తున్నది. 2022 సంవత్సరంలో ప్రారంభించిన ఈ షో 2025 సంవత్సరంలో జనవరి 18, 19 తేదీల్లో ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వబోతున్నది. అయితే ఈ షోకు సంబంధించిన టికెట్లు ఎంత? బ్లాక్ మార్కెట్‌లో ధర ఎంత పలుకుతున్నది అనే వివరాల్లోకి వెళితే..

Coldplay show Ticket Rates list Huge demand for tickets after Book My Show

ముంబైలో జరిగి కోల్డ్ ప్లే ఈవెంట్ కోసం పలు రకాల విభాగాల్లో టికెట్ రేట్లను నిర్వహించింది. స్టాండింగ్ టికెట్స్, సీటెడ్ టికెట్స్, లాంజ్ టికెట్స్, ఇనిఫినిటి టికెట్స్ అనే కేటగిరిలో అమ్మకాలను చేపట్టింది. అయితే ఈ టికెట్లను కొనుగోలు చేసేందుకు ఆదివారం (సెప్టెంబర్ 22) బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసింది. దాంతో ఫ్యాన్స్ పొటెత్తడంతో రచ్చ రచ్చగా మారింది.

కోల్డ్‌ప్లే బ్యాండ్ నిర్వహించే ఈవెంట్ కోసం టికెట్ ధర విషయంలోకి వెళితే.. స్టేజ్‌కు దగ్గరగా విలాసవంతంగా చూడటానికి వీలుండే లాంజ్ టికెట్ ధర 35 వేల రూపాయలు, స్టేజ్‌కు దగ్గరగా ఉండే సీట్లలో కూర్చొని వీక్షించే వెసలుబాటు ఉన్న టికెట్ సీటెడ్ ధర సుమారుగా 9500 రూపాయలు, ఇక స్టేజ్ ముందు కొంత దూరంగా నిలబడి కాన్సర్డ్‌ను చూసే వీలున్న టికెట్ 6450 రూపాయలు.

Coldplay show Ticket Rates list Huge demand for tickets after Book My Show

ఇక ఇన్షినిటీ టికెట్ విషయానికి వస్తే.. ఈవెంట్ జరిగే రోజే ఈ టికెట్లు అమ్ముతారు. ఆ రోజు టికెట్ లభించని వారికి ఈ షోను చూసే విధంగా టికెట్లను అందిస్తారు. ప్రతీ వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. ఈ టికెట్ ధర సుమారుగా 2 వేల రూపాయలు. వీరికి స్టేజ్‌కు దూరంగా కూర్చుని చూసే వెసలుబాటు ఉంటుంది.

అయితే కోల్డ్ ప్లే ఈవెంట్ కోసం అభిమానులు భారీగా పోటెత్తడంతో బుక్ మై షో ప్రస్తుతం క్యూ పద్దతి పాటిస్తున్నది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మాదిరిగా టికెట్లు అమ్ముతున్నది. దాంతో ఒక్కో యూజర్ కనీసం 1.5 లక్షల మంది తర్వాత గరిష్టంగా 7 లక్షల మంది తర్వాత టికెట్ పొందడానికి అవకాశం ఉందని బుక్ మై షో ఆడియెన్స్‌కు మెసేజ్ చూపిస్తున్నది. ఇక ఈ షో టికెట్లకు బ్లాక్ మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. లక్షల్లో రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ఫ్యాన్స్ వెనుకాడటం లేదనే విషయం సోషల్ మీడియాలో స్పష్టమైంది.

More from Filmibeat

Read more about: book my show coldplay mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X