Thank You మూవీలో హైలైట్ లీక్ చేసిన రైటర్.. అక్కినేని ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్

మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాల్లోకి వారసులు ఎక్కువగా వస్తుంటారు. మరీ ముఖ్యంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో మాత్రం కొందరే బడా హీరోలుగా ఎదిగారు. అందులో అక్కినేని నాగార్జున కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. కెరీర్ ఆరంభంలోనే చాలా హిట్లను అందుకున్న అతడు.. ఆ తర్వాత వరుసగా పరాజయాలతో సతమతం అయ్యాడు. ఈ పరిస్థితుల్లో 'మజిలీ' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడని నాగ చైతన్య.. ఆ తర్వాత 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో ఉన్న అక్కినేని నాగ చైతన్య.. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'థ్యాంక్యూ' మూవీ ఒకటి. 'మనం' వంటి ఫ్యామిలీ డ్రామా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగలేదు. దీంతో దీన్ని అనుకున్న సమయానికి కంప్లీట్ చేయలేకపోయారు.

College Episode Highlight in Thank You Movie

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తోన్న 'థ్యాంక్యూ' మూవీ బ్యాలెన్స్ వర్క్ కోసం ఇటీవలే షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా జరుపుతూ టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, ఈ సినిమాను జూలై 22న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయడంతో పాటు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించబోతున్నారు.

'థ్యాంక్యూ' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో దీనికి స్టోరీని అందించిన ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి అదిరిపోయే విషయాన్ని లీక్ చేశాడు. తాజాగా నాగ చైతన్య మాస్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. 'కాలేజ్‌లో అభిరామ్‌గా నాగ చైతన్య పరిచయ సన్నివేశం అక్కినేని ఫ్యాన్స్‌కు పైసా వసూల్‌గా ఉండబోతుంది. జూలై 22న థ్యాంక్యూ మూవీ చూస్తూ మీతో కలిసి విజిల్స్ వేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమాలో హైలైట్ సీన్ అదేనంటూ పరోక్షంగా వెల్లడించాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'థ్యాంక్యూ'లో నాగ చైతన్య పలు విభిన్నమైన గెటప్‌లలో కనిపిస్తాడు. అంతేకాదు, ఇందులో అతడు మహేశ్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా చేస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్ కీలక పాత్రను చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X