మళ్లీ కొత్త కథతో ముందుకు.. ‘కలర్ ఫోటో’ దర్శకుడు పోస్ట్ వైరల్

కలర్ ఫోటో సినిమాతో తెలుగు ఇండస్ట్రీని దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. సున్నితమైన భావోద్వేగాలు, స్వచ్చమైన ప్రేమ కథను అందంగా మలిచాడు సందీప్ రాజ్. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్‌లను మెయిన్ లీడ్‌గా పెట్టి తీసిన కలర్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆహాలో విడుదలైన ఈ మూవీ లాక్డౌన్‌లో అందరి మనసులను గెలుచుకుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్దలను కలర్ ఫోటో తెగ ఆకట్టుకుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా తన ఆఫీస్‌కు పిలిపించుకుని మరీ అభినందించాడు. చిత్రయూనిట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించిన బన్నీ.. సినిమాలోని ప్రతీ సీన్‌ గురించి చెప్పాడట. దర్శకుడు హీరో హీరోయిన్లకు తన తరుపున చిన్న బహుమతులను కూడా ఇచ్చాడు. అలా సందీప్ రాజ్ మొదటి సినిమాతోనే తన సత్తాను అందరికీ చూపించాడు. అయిత తాజాగా తన కొత్త సినిమా పనులను మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.

Color photo Director Sandeep raj Focuses On Second Project

తాజాగా ప్రొడ్యూసర్, మెగా అభిమాని అయినా ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్)తో కలిసి ఉన్న ఫోటోను సందీప్ షేర్ చేశాడు. రెండో ప్రాజెక్ట్ రెడీ అంటూ సందీప్ రాజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతే కాకుండా స్క్రిప్ట్ మలిచిన తీరు అదిరిపోయిందంటూ నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన కామెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సారి కూడా ప్రేమకథనే ఎంచుకున్నాడా? లేదా ట్రాక్ మార్చాడా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X