2029లో చంపేస్తామని వైసీపీ నేతల బెదిరింపులు.. 11 సీట్లు వచ్చినా బుద్ది రాలేదు.. ఫృథ్వీ ఫైర్

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 11 గొర్రెలు అంటూ కామెంట్ చేయడం వివాదంగా మారింది. దాంతో వారు ఆయనను ట్రోల్ చేయడంతో వైఎస్ఆర్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజ్ పెడుతూ నన్ను నా కుటుంబాన్ని వేధించారు. దాంతో నేను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఇటీవల లైలా సినిమా ఫంక్షన్‌లో నేను మాట్లాడిన మాటలను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అభ్యంతరం చెప్పింది. ఆ ఫంక్షన్ తర్వాత నాకు ఫోన్లు చేసి నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిని తిట్టారు. పులివెందుల యూత్ నేత, మరో వ్యక్తి అనిల్ నా ఫోన్ నంబర్ ట్విట్టర్‌లో పెట్టారు. వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఫిర్యాదు చేశాను అని పృథ్వీ తెలిపారు.

Comedian 30 years Industry Prudhvi Raj complaint on YSRCP Leaders to Hyderabad Cyber Police over Laila controversy

వైసీపీ టార్గెట్ నాపైనే. వాళ్లు 11 సీట్లకు పరిమితమైనా వారికి ఇంకా బుద్ది రాలేదు. గొర్రెలు సీను సినిమాలో ఉన్నాయి. 11 నంబర్ గురించి మాట్లాడితే వాళ్లకు భయం. సినిమా హైప్‌ కోసం నేను వారిని టార్గెట్ చేయలేదు. వారు బాయ్ కాట్ చేస్తే సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించదు. నాపై కొందరు సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నా ఫోన్ నెంబర్ ట్విట్టర్‌లో పెట్టి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిపై ఫిర్యాదు చేశాను. వారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాను అని పృథ్వీ చెప్పారు.

లైలా ఈవెంట్ తర్వాత నాపై మాటల దాడికి దిగారు. ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. 2029 సంవత్సరంలో నిన్ను మంగళగిరిలో లేపేస్తాం. నన్నే కాదు నా ఫ్యామిలీని బెదిరిస్తున్నారు. వాటికి సమాధానం రెండు, మూడు రోజుల్లో చెబుతాం. అయితే నా తల్లిని దూషించడం వల్ల నాకు బీపీ పెరిగిపోయింది. దాంతో నేను కిందపడిపోయాను. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించారు అని పృథ్వీ చెప్పారు.

Comedian 30 years Industry Prudhvi Raj complaint on YSRCP Leaders to Hyderabad Cyber Police over Laila controversy

సినీ హీరో విశ్వక్ సేన్ నాకు కొడుకు లాంటి వాడు. లైలా సినిమా అద్బుతంగా వచ్చింది. వైసీపీ వాళ్లు బాయ్ కాట్ అంటే ఏం జరగదు. సినిమా భారీ విజయం సాధిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి లేపేస్తామని బెదిరించారు. పులివెందులకు చెందిన బ్యాచ్‌ ఈ చర్యకు పాల్పడుతున్నారు. నా ఇంటి ముందు అనుమానాస్పదంగా కార్లు తిరుగుతున్నాయి అని పృథ్వీ చెప్పారు.

నా వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని అగౌరపరిచారు. నా తల్లిని దారుణంగా తిట్టారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేస్తాం. నా ప్రతిష్టకు భంగం కలిగించినందుకు వారిపై పరువు నష్టం దావా వేస్తాను. వారిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్దం. పాలిటిక్స్ నేపథ్యంగా సినిమా తీస్తాను. అప్పుడే వారితో తెల్చుకొంటానని పృథ్వీ అన్నారు.

More from Filmibeat

Read more about: ysrcp prudhvi raj laila
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X