పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ నుంచి ఆ ఒక్కటి మిస్సయ్యాను: కమెడియన్ అలీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీ పరిశ్రమలో చాలా మంది ఇష్టపడే వ్యక్తి. అభిమానులు ఏ రేంజ్ లో ఇష్టపడతారో అలాగే సినీ ప్రముఖులు కూడా చాలా వరకు పవర్ స్టార్ ని అదే రేంజ్ లో లైక్ చేస్తుంటారు. ఇక అలీ, పవన్ కళ్యాణ్ ఎంత మంచి మిత్రులొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రాజకీయాల కారణంగా వీరి మధ్య గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తరువాత అలీ పవన్ గురించి లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

పవన్ కళ్యాణ్ స్నేహం..
పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ స్నేహం గురించి అందరికి తెలిసిందే. గోకులంలో సీత సినిమాతో మొదలైన వారి పరిచయం ఆ తరువాత కాటమరాయుడు వరకు కొనసాగింది. పవన్ సినిమాలో నటిస్తున్నాడు అంటే అలీ కూడా ఉండాల్సిందే. కేవలం రెండు సినిమాలు తప్పిస్తే పవన్ మిగతా సినిమాలన్నింటిలో అలీ ఉన్నాడు. ఇదే విషయాన్ని అలీ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రాజకీయాల కారణంగా..
గత ఎలక్షన్స్ లో కమెడియన్ అలీ ఎవరు ఊహించని విదంగా వైసిపి పార్టీలో చేరడంతో అందరు షాక్ అయ్యారు. అదే విదంగా ఇరువురి మధ్య పరస్పర మాటల యుద్ధం జరగడంతో వారి స్నేహానికి బ్రేక్ పడినట్టు టాక్ వచ్చింది. ఓ విదంగా అభిమానులను ఆ విషయం షాక్ కి గురి చేసింది. మళ్ళీ ఆ వివాదంపై అలీ కూడా పెద్దగా స్పందించలేదు.

స్పందించిన అలీ..
ప్రస్తుతం లాక్ డౌన్ లో తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటున్న కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. రాజకీయల గురించి పెద్దగా స్పందించని అలీ పవన్ కళ్యాణ్ తో తనకు ఉన్న అనుబంధం గురించి వివరించాడు. పవన్ తో పరిచయం దగ్గరి నుంచి ఆయనతో ఉండే స్నేహం గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు.
Recommended Video

ఓ ఒక్కటి మిస్ అయ్యాను..
పవన్ కళ్యాణ్ కి ఒక మామిడి తోట ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఏడాది సమ్మర్ లో తనకు సన్నిహితంగా ఉండే సినీ ప్రముఖులకు పవన్ స్వచ్ఛమైన మామిడి పండ్లను పంపుతూ ఉంటాడు. అయితే ఈ ఏడాది పరిస్థితుల ప్రభావం వల్ల ఆ ఒక్కటి మిస్సయ్యాను అని ఆయన కూడా పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నారని అలీ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











