Comedian Ali: వైభవంగా కమెడియన్ అలీ కూతురు ఎంగేజ్​మెంట్​.. వరుడెవరంటే?

అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై స్టార్ కమెడియన్ ఇమేజ్​ సంపాదించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అలీ వెయ్యికిపైగా సినిమాల్లో నటించి తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. ఇదిలా ఉంటే త్వరలో అలీ కూతురు పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో అలీ కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను అలీ భార్య జుబైదా తన యూట్యూబ్​ ఛానెల్​లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఎంగేజ్​మెంట్​ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

తనదైన కామెడీ టైమింగ్​..

తనదైన కామెడీ టైమింగ్​..

టాలీవుడ్​ ప్రముఖ కమెడియన్​ అలీ గురించి అందరికీ తెలిసిందే. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ వెయ్యికిపైగా చిత్రాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్​ను చూపించాడు. అలీ కెరీర్​ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించాడు.

 1100కుపైగా సినిమాలు..

1100కుపైగా సినిమాలు..

తర్వాత హీరోగా, కమెడియన్​గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అలీ ఇప్పటివరకు 1100కుపైగా సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇంకా స్పెషల్​గా చెప్పాలంటే మాస్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉండే అలీ పాత్రలు విభిన్నంగా ఉంటాయి.

ఇద్దరు కూతుర్లు..

ఇద్దరు కూతుర్లు..

ఇక అలీ కుటుంబ విషయానికొస్తే.. ఆయన జుబేదాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కాగా పెద్ద కూతురు పేరు ఫాతిమా రెమీజున్​. ఆమె ఇటీవలే మెడిసిన్​ పూర్తి చేసింది.

ఘనంగా ఎంగేజ్​మెంట్​..

ఘనంగా ఎంగేజ్​మెంట్​..

ఇక రెండో కుమార్తే పేరు జువేరియా. ఈమె 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అని సినిమాలో చిన్న కారెక్టర్ కూడా చేసింది. అలీ కొడుకు పేరు మొహమ్మద్ అబ్దుల్​ సుభాన్. అయితే ప్రస్తుతం అలీ పెద్ద కూతురు ఫాతిమాకు ఎంగేజమ్​మెంట్​ జరిగింది. ఈ నిశ్చితార్థ కార్యాక్రమం ఘనంగా నిర్వహించారు.

 హాజరైన బ్రహ్మానందం..

హాజరైన బ్రహ్మానందం..

ఈ వేడకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై ఫాతిమాను ఆశీర్వదించారు. స్టేజ్​పైన బ్రహ్మానందం తనదైన కామెడీతో అలరించాడని సమాచారం. అలాగే డైలాగ్​ కింగ్​ సాయికుమార్​ కుటుంబ సమేతంగా హాజరై అలీ కుటుంబంతో సరదాగా ముచ్చటించారు.

యూట్యూబ్​ వీడియోస్​తో..

యూట్యూబ్​ వీడియోస్​తో..

ఇక అలీ భార్య జుబేదా గురించి తెలియని నెటిజన్లు ఉండరు. ఆమె తన యూట్యూబ్​ వీడియోస్​తో సెపరేట్​ ఫ్యాన్​ బేస్​ ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే ఆమె ఛానెల్​కు సుమారు 5 లక్షల మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు.

 వైరల్​ అవుతున్న వీడియో..

వైరల్​ అవుతున్న వీడియో..

తాజాగా ఆమె పెద్ద కూతురు ఫాతిమా ఎంగేజమ్​మెంట్​ వేడుకను తన యూట్యూబ్​ ఛానెల్​లో అప్​లేడ్ చేసింది జుబేదా. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే వైరల్​గా మారింది. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులతోపాటు నెటిజన్లు కూడా ఫాతిమాకు విష్​ చేస్తున్నారు.

వరుడెవరంటే?

వరుడెవరంటే?

అతిరథుల సమక్షంలో ముస్లిం సాంప్రదాయం ప్రకారం అలీ కూతురు నిశ్చితార్థం వైభవంగా నిర్వహించారు. అయితే ఫాతిమాకు కాబోయే వరుడు డాక్టర్​ అని తెలుస్తోంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ వైద్యులేనని జుబేదా తన వీడియోలో పరిచయం చేస్తూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X