అలీ కూతురు ఎంట్రీకి రంగం సిద్దం.. అంత పవిత్రమైనది స్త్రీ అంటోన్న కమెడియన్
కమెడియన్, హీరో, యాంకర్ ఇలా అన్నింటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పర్చుకున్నాడు అలీ. దాదాపు వెయ్యి చిత్రాలకు పైగా నటించి టాలీవుడ్‌లో ఫేమస్ అయిన అలీ.. ఇంకా ప్రధాన పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు. ఆయన నటించిన మరో చిత్రం మా గంగానది. మహిళల గొప్పదనాన్ని చాటుతూ తెరకెక్కించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఉమెన్స్ డేన రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్‌డేట్ తెలిసింది. అదేంటో ఓ సారి చూద్దాం.

వారసుల తెరంగేట్రం..
కమెడియన్స్ అయినా, నిర్మాతలైనా, దర్శకులైనా వారి పిల్లలు తెరపై హీరోగా, హీరోయిన్లుగానో వెలుగుతూ ఉంటే చూడాలనుకుంటారు. అందుకే చిన్నప్పటి నుంచి నటనలో శిక్షణ ఇప్పిస్తూ.. సినీ రంగంపై మక్కువ కలిగేలా చేస్తారు. సెలెబ్రిటీల పిల్లలు కూడా అదే లోకంలో పెరగడంతో సహజంగానే పరిశ్రమై ఆసక్తి ఏర్పడుతుంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ఎంట్రీ..
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ వంటి హీరోలు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. శ్రీదేవీ, మీనా, రాశీ వంటి ఎంతో మంది హీరోయిన్లు బాలనటిగానే ఎంట్రీ ఇచ్చారు. తాజాగా కమెడియన్ అలీ కూడా తన కూతురుని బాలనటిగా తెరకు పరిచయం చేయబోతోన్నాడు.
మహిళల నేపథ్యంలో..
సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద మా గంగానది.. అంత పవిత్రమైనది స్త్రీ అనే క్యాప్షన్‌తో రాబోతోందని తెలిపాడు. మహిళా నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఉమెన్స్ డేన ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నామన్నాడు.
Recommended Video


కూతురు జుబేరియా ఎంట్రీ..
అలీ తన రెండో కూతురు జుబెరియా (6)ను మా గంగానది సినిమాతో బాలనటిగా తెరకు పరిచయం చేయబోతోన్నాడు. ఈ చిత్రంలో అలీ కూతురుగానే జుబెరియా నటించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అలీ న్యాయవాదిగా కనిపించబోతోన్నాడు. ఈ చిత్రానికి బాల నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











