Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహిళల కోసం కమెడియన్ ఆలీ కీలక నిర్ణయం.. భార్య జుబేదాతో కలిసి ఒకేసారి 130మందికి చేయూత..
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్ ఆలీ నటుడిగా ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక అప్పుడప్పుడు ఇండస్ట్రీలో జరిగే మంచి కార్యక్రమాల్లో పాల్గొంటు కష్టాల్లో ఉన్న వారికి కూడా తనవంతు సహాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా ఆలీ మరో పనికి శ్రీకారం చుట్టారు.
దాదాపు అందరి హీరోలతో..
కమెడియన్ ఆలీ కెరీర్ మొదటి నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో మేలుగుతూ వచ్చాడు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దాదాపు అందరి హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో అందరు దర్శకులు కూడా ఆలీ నటనను ఎంతగానో ఇష్టపడతారు. ఇక ఆలీ తనకంటే చిన్న నటీనటులకు కూడా సహాయం అందిస్తుంటాడు.
అలాంటి వారికోసం..
ఇక రీసెంట్ గా 130 కుటుంబాలకు ఉపయోగపడేలా ఆలీ తనవంతు సహాయం చేశాడు. ఏదైనా షూటింగ్ జరిగినప్పుడు అందరికంటే ముందే వచ్చే వారిలో ప్రొడక్షన్ మహిళలు ముందుంటారు. ఎప్పటికప్పుడు షూటింగ్ జరుగుతున్నంత సేపు పనులు చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి అలీ నిత్యావసర సరుకులను అంధించాడు.
భార్య జుబేదాతో
ఆలీ తన భార్య జుబేదాతో కలిసి ఆదివారం ఉదయం తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులను అందించారు. 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో ఈ పనికి శ్రీకారం చుట్టినట్లు వివరణ ఇచ్చారు.
ఈ కష్ట సమయంలో..
ఒక్కొక్కరికి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను అందించారు. మేము ప్రతిరోజూ షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్ యూనియన్‌లోని లేడీస్ అందరికంటే ముందే షూటింగ్ స్పాట్లకు వెళ్లి శుభ్రం చేస్తారని, అందరు తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను శుభ్రం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని ఆలీ చెప్పాడు.
అయితే ఈ కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న వారి కోసం దాదాపు 2లక్షల రూపాయల ఖర్చుతో ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను.. అని ఆలీ వివరణ ఇచ్చారు.