కమెడియన్ అలీ కుటుంబంలో సూసైడ్.. 15 ఏళ్లకు బయటపెడుతూ ఎమోషనల్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 35 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లోని ప్రతి ఒక్క స్టార్ హీరోతో మంచి సంబంధాలు కలిగిన నటుడు. అగ్ర హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల్లోనూ నటిస్తూ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నారు. నెక్ట్స్ యంగ్ హీరో సుహాస్ చిత్రంలో ప్రధాన పాత్రలో అలరించబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రస్తుతం అలీ స్పీచ్ హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

చిత్ర పరిశ్రమలో సంచలనంగా..
అక్టోబర్ 10, 1967న అలీ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి ఆయన జన్మస్థలం కావడం విశేషం. ఆయన మిడిల్ క్లాస్ కుటుంబంలో నుంచే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలుత బాల నటుడిగా తెలుగు చిత్రాల్లో నటించే ఛాన్స్ ను దక్కించుకున్నారు. 1990లో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి 2025 వరకు నిర్విరామంగా సినిమాలు చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పటి వరకు 1000కి పైగా చిత్రాల్లో నటించి టాప్ కమెడియన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. చిత్రాలతోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ దుమ్ములేపాడు. అలీతో సరదాగా.. టాక్ షోతో ప్రేక్షకులకు మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించారు.

Comedian Ali Nephew suicide

సుహాస్ కు సపోర్ట్ గా అలీగా..
టాలీవుడ్ లో ప్రస్తుతం రైజ్ అవుతున్న హీరోలకు తనవంతు సపోర్ట్ గా వారి చిత్రాల్లో పలు కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు అలీ. చివరిగా డబుల్ ఇస్మార్ట్, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో అలరించారు. ఇక నెక్ట్స్ కలర్ ఫోటో ఫేమ్ హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం హో రామా అయ్యో భామ అనే చిత్రంలో కీలక పాత్రతో అలరించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అలీ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొని మాట్లాడారు. సుహాన్ లో తన మేనల్లుడిని చూసుకున్నానని చెబుతూ 15 ఏళ్ల కింద జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమయ్యారు.

15 ఏళ్ల కిందనే సూసైడ్..
నటుడు, టాప్ కమెడియన్ అలీ తాజాగా సుహాస్ రాబోయే చిత్రం 'ఓ రామా అయ్యో భామా' అనే చిత్రంలో సుహాస్ కు మామ పాత్రలో నటించారు. జూలై 11న ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా అలీ ప్రమోషన్స్ లో పాల్గొని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన మేనల్లుడు 15 ఏళ్ల కింద ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం షాకింగ్ న్యూస్ గా మారింది.

అయితే అతన్ని ఓ అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని, దాంతో అతను చనిపోయాడని చెబుతూ బాధపడ్డాడు. అతని తలుచుకుంటూ అలీ తల్లి ఇప్పటికీ బాధపడుతూనే ఉందని చెప్పారు. ఈ చిత్రంలో సుహాస్ కు కూడా మేనమామగా నటించానని, నా మేనల్లుడే గుర్తుకు వచ్చి ఎమోషనల్ అయ్యానని చెప్పారు.

More from Filmibeat

Read more about: comedian ali suhas tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X