పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై అలీ షాకింగ్ కామెంట్స్.. ఇంకా మిత్రద్రోహాన్ని మార్చిపోలేదు సార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల్లో ఏలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో సిని ప్రముఖుల్లో కూడా అదే స్థాయిలో మంచి వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయనతో అంతకుముందు వరకు సన్నిహితంగా ఉండేవారి అసలు రంగులు బయటపడ్డాయనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక అభిమానుల నుంచి అలాంటి విమర్శలు ఎదుర్కొన్న అలీ చాలా కాలం తరువాత పవర్ స్టార్ వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో ఊహించని విధంగా స్పంధించడం వైరల్ గా మారింది.

 అలీని స్నేహితుడి కంటే ఎక్కువగా..

అలీని స్నేహితుడి కంటే ఎక్కువగా..

పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటే తక్కువ స్టార్ డమ్ ఉన్న వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక కెరీర్ మొదటి నుంచి అలీని ఒక స్నేహితుడి కంటే ఎక్కువగా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఉహీంచని విధంగా ఆ స్టార్ కమెడియన్ గత ఎన్నికల్లో పవన్ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరడం అందరిని షాక్ కి గురి చేసింది. అనంతరం పవన్, అలీ మధ్య ఎలాంటి మాటల యుద్ధం మొదలైందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అభిమానుల సెలబ్రేషన్స్ లో..

అభిమానుల సెలబ్రేషన్స్ లో..

అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పై అలీ స్పందించిన తీరు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తో అభిమానూలు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయగా స్టార్ సెలబ్రెటీస్ కూడా పవర్ స్టార్ కి విషెస్ అందిస్తున్నారు. అలీ కూడా పవన్ పై చాలా పాజిటివ్ స్పందించారు. కానీ అభిమానులు మాత్రం మిత్ర ద్రోహి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలీ షాకింగ్ ట్వీట్..

అలీ షాకింగ్ ట్వీట్..

'వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు, నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు.. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వు కి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు' అంటూ అలీ చేసిన ట్వీట్ బాగానే ఉంది. కానీ అభిమానులు మాత్రం అలీ చేసిన ట్వీట్ పై మండిపడుతూ రాజకీయాల కోసం రంగులు మారే నీ వ్యక్తిత్వాన్ని ద్రోహాన్ని మర్చిపోలేదని అంటున్నారు.

 ఆ మాటలను మర్చిపోలేరు..

ఆ మాటలను మర్చిపోలేరు..

గతంలో అలీ ఎలక్షన్స్ కి ముందు వైఎస్. జగన్ కి మద్దతు పలుకుతూ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా ఆ మాటలను ఏ మాత్రం మర్చిపోలేదని అలీకి వచ్చిన సమాధానాలు చూస్తే అర్ధమవుతోంది. ఎన్ని మాటలు అన్నా చెదరని చిరునవ్వా? ఆ మాటలు అన్నవాళ్లలో మీరూ ఒకరు కాదా? మీరు మా ప్రాణామైన పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు మర్చిపోలేదు అలీ గారు, మీరు ఇప్పుడు ఆయన పేరు ఎత్తుకున్నా కానీ మేము మిమల్ని మళ్ళీ ఎత్తుకునే సమస్యే లేదు! జై జనసేన జై హింద్ అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
అవసరాలకి వాడుకొని వదిలేశారు..

అవసరాలకి వాడుకొని వదిలేశారు..

మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాని నీకు.. నీ కన్న తల్లి చనిపోతే కనీసం సానుభూతి తెలపని వాడితో ఉన్నావు. పార్టీ కండువా కప్పి అవసరాలకి వాడుకొని వదిలేశారు. మళ్లీ నిన్ను మా పవన్ కళ్యాణ్ గారు ఎలా క్షమిస్తాడు మిస్టర్ అలీ అంటూ మరొక అభిమాని సమాధానం ఇచ్చాడు. మొత్తంగా పవర్ స్టార్ అభిమానులు అలీ మాటలను ఏ మాత్రం మర్చిపోలేదని క్లియర్ గా అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X