Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సరికొత్తగా కనిపించనున్న కమెడియన్... అబ్దుల్ కలామ్ గా అలీ
రెండు దశాబ్దాలుగా స్టార్ కమెడియన్ గా వెలుగొందుతున్న అలీ, ఆన్ స్క్రీన్ లోనూ, ఆఫ్ స్క్రీన్ లోనూ ప్రేక్షకులనూ నవ్విస్తూనే ఉన్నారు. అయితే, ఇప్పుడు అలీ సీరియస్ మోడ్ లోకి ఎంటరవ్వబోతున్నారు. ఎందుకంటే, ఆయన ఇప్పుడు భారత సుప్రసిద్ధ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, డాక్టర్ అబ్దుల్ కలామ్ పాత్రకు వెండితెరపై ప్రాణం పోయనున్నారు.
మహానటి సూపర్ సక్సెస్ అయిన నాటి నుంచి తెలుగులోనూ బయోపిక్ ల ట్రెండ్ ఊపందుకుంది. ఇక కొంతకాలంగా టిన్సెల్ టౌన్ లో డాక్టర్ కలామ్ బయోపిక్ గురించిన ప్రస్తావనపై జోరుగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అలీ లీడ్ రోల్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.
పిక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్, హాలీవుడ్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, హాలీవుడ్ లో పనిచేసిన జగదీశ్ దానేటి దర్శకత్వం వహించబోతున్నారు. ఇది అలీకి 1111వ సినిమా కాగా, కలామ్ వంటి మహా పురుషుని పాత్రలో నటించడం తన అదృష్టమని సీనియర్ కమెడియన్ తెలిపారు. మరి, ఇన్నాళ్లూ కమెడియన్ గా నవ్వించిన అలీ, కలామ్ పాత్రకు కూడా న్యాయం చేస్తారని ఆశిద్దాం.