twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాంటిక్ హీరోగా మారిన అలీ.. కశ్మీర్‌లో ఆటపాట.. ఫీల్‌గుడ్ చిత్రానికి నిర్మాతగా స్టార్ కమెడియన్

    |

    బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఆలీ అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెర మీద యాంకర్, హోస్ట్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతగా మారిన అలీ.. రొమాంటిక్ హీరోగా మరోసారి ప్రేక్షకులకు చేరువకానున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...

    1100పైగా చిత్రాల్లో నటించిన ఆలీ

    1100పైగా చిత్రాల్లో నటించిన ఆలీ

    సీతాకోక చిలుక చిత్రంలో తనదైన కామెడీతో ఆకట్టుకొన్న అలీకి సినిమా రంగంలో ఎదురేలేకుండా పోయింది. దశాబ్దాలుగా అలుపెరగకుండా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొంటూనే ఉన్నారు. యమలీలతో హీరోగా మారిన పలు చిత్రాల్లో కథానాయకుడిగా కొనసాగారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 1100పైగా చిత్రాల్లో నటించిన ఆలీ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

    మరోసారి వెండితెరపై హీరోగా

    మరోసారి వెండితెరపై హీరోగా


    యమలీల తదితర చిత్రాల తర్వాత గ్యాప్ తర్వాత మంచి కథ లభించడంతో అలీ హీరోగా మరోసారి తన అదృష్టాన్ని బాక్సాఫీస్ వద్ద పరీక్షించుకోవడానికి సిద్దమయ్యారు. కమెడియన్‌గా, టీవీ హెస్ట్‌గా బిజీగా ఉంటూనే ఓ ఫీల్‌గుడ్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    కాశ్మీర్‌లో రొమాంటిక్‌గా పాట చిత్రీకరణ

    కాశ్మీర్‌లో రొమాంటిక్‌గా పాట చిత్రీకరణ

    అందరూ బావుండాలి అందులో నేనుండాలి అనే చిత్రం కోసం నటుడు తాజాగా నిర్మాతగా మారారు. ఈ చిత్రం దాదాపు 90 శాతం పూర్తయింది. ఈ సినిమాలోని రొమాంటిక్ పాట కోసం కాశ్మీర్‌కు వెళ్లి వచ్చారు. కాశ్మీర్‌లోని పలు అందమైన ప్రదేశాల్లో నా గుండె చిక్కుకుంది నీ కళ్లతో... అనే పాటను చిత్రీకరించారు. ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించారు అని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మన్ వద్ద పనిచేసిన రాకేశ్ పళిదం సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

    మలయాళంలో హిట్టైన సినిమా ఆధారంగా

    మలయాళంలో హిట్టైన సినిమా ఆధారంగా


    మలయాళంలో విడుదలై సంచలన విజయం సాధించిన వికృతి చిత్రం ఆధారంగా అందరూ బావుండాలి. అందులో నేనుండాలి చిత్రం తెరకెక్కుతున్నది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌ నిర్మిస్తున్నారు.

    Recommended Video

    Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు: అలీ, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు
    దర్శకత్వం: శ్రీపురం కిరణ్‌
    నిర్మాతలు: అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌
    సమర్పణ: ఆలీ
    సంగీతం: రాకేశ్‌ పళిదం
    చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌: ఇర్ఫాన్
    కో డైరెక్టర్‌: ప్రణవానంద్‌
    కెమెరా: ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి
    ఆర్ట్‌: కేవీ రమణ
    డాన్స్‌ డైరెక్టర్‌: స్వర్ణ
    ఎడిటర్‌: సెల్వకుమార్
    ఫైట్స్‌: నందు
    మేకప్‌: నంద్యాల గంగాధర్
    ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సయ్యద్‌ తాజ్‌ బాషా
    వీఎఫ్‌ఎక్స్‌: మాయాబజార్‌ స్టూడియో
    బ్యానర్: అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

    English summary
    Comedian Ali turns as hero and Producer for Andaru Bagundali Andulo nenundali.Some beautiful Candid Click's Of Ali and Mouryani From Andaru Bagundali Andulo Nenundali. This movie Shooting was 90% Completed. Ali and Mouryani are lead pair in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X