బంగారు బుల్లోడుగా అల్లరి నరేష్.. ఫ్లాఫుల కష్టాలు తీరేనా?
నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం బంగారు బుల్లోడు టైటిల్‌తో హీరో అల్లరి నరేష్ అలరించబోతున్నారు. ఏ టీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై పీవీ గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఫ్లాప్‌లతో అల్లాడుతున్న అల్లరి నరేష్ నటిస్తున్న 55వ చిత్రం ఇది. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్, పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నరేష్ లుక్ ఆసక్తికరంగా ఉంది. అందాల భామ పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ప్రేక్షకులను కామెడీతో మెప్పించనుంది. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభవుతాయి. సాయి కార్తీక్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని మే చివరివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: అల్లరి నరేష్, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్ దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల తదితరులు
మాటలు: వెలిగొండ శ్రీనివాస్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,
ఫైట్స్: రియల్ సతీష్,
ఆర్ట్: ఎన్.గాంధీ,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
కెమెరా: సతీష్ ముత్యాల,
సంగీతం: సాయి కార్తీక్,
ప్రొడ్యూసర్: సుంకర రామబ్రహ్మం,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పీవీ గిరి


Click it and Unblock the Notifications











