Ramam Ragavam దర్శకుడిగా కమెడియన్ ధన్‌రాజ్.. సెన్సేషనల్ యాక్టర్ హీరోగా!
సినీ నటులు నిర్మాతలుగా, దర్శకులుగా మారడం సాధారణంగా కనిపిస్తుంటుంది. అలాగే దర్శక, నిర్మాతలు కూడా నటులుగా మారడం సహజంగానే జరుగుతుంటుంది. తాజాగా కమెడియన్‌గా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ధన్‌రాజ్ ప్రస్తుతం దర్శకుడిగా మారుతున్నారు. స్వీయ దర్శకత్వంలో రామం రాఘవం సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా.. సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
రామం రాఘవం సినిమా ఫస్ట్ లుక్ విషయానికి వస్తే.. తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధన్‌రాజ్ కనిపించారు. యూనిట్ వెల్లడించిన ప్రకారం.. ఇప్పటి వరకు రాని ఓ తండ్రి కొడుకుల కథను ఆవిష్కరిస్తున్నట్టు తెలిసింది. సముద్రఖని, ధన్‌రాజ్ క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ ఎమోషనల్‌గా ఉంటుంది అని చెప్పారు.

పృథ్వీ పోలవరపు నిర్మాతగా, రామం రాఘవం మూవీని ప్రభాకర్ అరిపాక సమర్పిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. ధన్ రాజ్ దర్శకుడిగా మారి స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
నటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు
కథ: శివ ప్రసాద్ యానా (విమానం దర్శకుడు)
సంగీతం: అరుణ్ చిలువేరు
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫి: దుర్గా ప్రసాద్


Click it and Unblock the Notifications











