ఫిష్ వెంకట్ కు అందని సాయం.. ప్రభాస్ 50 లక్షలు ఏమయ్యాయి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగారో అదే స్థాయిలో సాయం కూడా చేస్తుంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంభవించిన విపత్తులకు కోట్లల్లో ఆర్థిక సాయం అందించారు. మరిన్ని ప్రమాదకర ఘటనల్లోనూ లక్షల్లో విరాళం అందించారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామెడీ విలన్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం బాగా లేక అవస్థలు పడుతున్నాడు. కొద్దిరోజులుగా ఆస్పత్రి బెడ్ పైనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక సాయం కోరుతూ కుటుంబ రోడ్డుకు వచ్చింది. కాగా ప్రభాస్ సాయం అందిస్తారంటూ వాళ్లకి కాల్ వచ్చింది. కానీ ఇంకా సాయం మాత్రం అందలేదు. దానిపై తాజాగా ఫిష్ వెంకట్ కూతురు స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

25 ఏళ్లుగా ఫిష్ వెంకట్ జర్నీ..
హైదరాబాద్ లో 1971 ఆగస్టు 31న పుట్టి పెరిగారు ఫిష్ వెంకట్. బాల్యమంత మహానగరంలోనే ఉన్నారు. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో 2000 సంవత్సరంలో తొలిసారిగా వెండితెరపై అలరించారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, వెంకటేశ్, రవితేజ, నాగార్జున, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు, మిగితా సపోర్టింగ్ రూల్స్ లో నటించి అలరించారు. ఇలా దాదాపు 25 ఏళ్లుగా టాలీవుడ్ లో తెలంగాణ యాస, భాషతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో 100 చిత్రాల వరకు నటించారు.

Comedian Fish Venkat Health Condition critical

ఫిష్ వెంకట్ హెల్త్ కండీషన్..
గత 5 రోజులుగా ఫిష్ వెంకట్ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషయంగానే ఉందని కుటుంబ సభ్యులు, వైద్యలు వివరిస్తున్నారు. అయితే సరైన ఆర్థిక సాయం అందితే మాత్రం బతికించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా కొన్నాళ్లుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అందుకు ఆపరేషన్ అవసరమని, భారీగానే ఖర్చు అవుతుందని ఫిష్ వెంకట్ భార్య, కూతురు సాయం కోరారు.

ప్రభాస్ టీమ్ నుంచి ఫోన్ కాల్..
ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తర్వాత ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వచ్చిందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ పీఏ అని చెప్పి ఎవరో ఫోన్ కాల్ చేశారని, రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారని ఫిష్ వెంకట్ కూతురు చెప్పించింది. కానీ మరుసటి రోజు తిరిగి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని తాజాగా మీడియాకు వివరించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ, సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి గానీ, సినీ ఇండస్ట్రీ గురించి గానీ ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని చెప్పారు.

రూ.50 లక్షలు ఏమయ్యాయి..
కేవలం ఫిష్ వెంకట్ కు మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆస్పత్రికి వచ్చి మరీ రూ.1లక్ష సాయం చేశారని తెలిపారు. అయితే ప్రభాస్ పీఏ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. వాళ్లించి వాళ్లే ఫోన్ చేసి సాయం చేస్తామని, మళ్లీ స్పందించకపోవడం ఏంటనేది సందేహంగా మారిందన్నారు. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: fish venkat prabhas tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X