కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూత.. సినీ వర్గాల్లో తీవ్ర విషాదం

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ ప్రముఖుల వరుస మరణాలు సినీ అభిమానులను విషాదంలోకి నెట్టాయి. ఇటీవల కోటా శ్రీనివాసరావు, బీ సరోజాదేవీ మృతి వార్తలు మరవకముందే.. మరో సినీ ప్రముఖుడు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. కొద్ది నెలలుగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి సినీ వర్గాలు విషాదంలో మునిగిపోయారు. ఆయనకు మెరుగైన చికిత్స కోసం ముందుకొచ్చిన విశ్వక్ సేన్, తదితర సినీ నటులు ప్రయత్నాలు సఫలం కాకపోవడంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ఫిష్ వెంకట్‌కు జీవిత వివరాల్లోకి వెళితే..

ఫిష్ వెంకట్ అసలు పేరు..
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఫిష్ వెంకట్ వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సువర్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఫిష్ వ్యాపారంలో కుటుంబం ఉండటంతో ఆయనను తన స్నేహితులు, సన్నిహితులు ముద్దుగా ఫిష్ వెంకట్ అనిపిలుచుకొనే వారు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఆయనకు మొదటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ ఆయనను తెలుగు సినీ పరిశ్రమలో భాగమయ్యేలా చేసింది.

Comedian Fish Venkat Passed away

తెలంగాణ యాసపై పట్టు
ఫిష్ వెంకట్‌కు స్వచ్చమైన తెలంగాణ యాస, హైదరాబాదీ యాస పలికే నేర్పు ఉండటం ఆయనకు అదృష్టంలా మారింది. తెలుగు సినిమా రంగంలో యాస, భాషను స్పష్టంగా పలకే వారు అరుదుగా ఉండటంతో ఆ స్వభావం ఉన్న పాత్రలు ఆయనన వెతుక్కొంటూ వచ్చాయి. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క చిత్రం ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన ఖుషితో గుర్తింపు పొందారు.ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రం ఆయనకు ఎనలేని పాపులారిటీ తీసుకొచ్చింది.

100 చిత్రాలకుపైగా
తెలుగు సినిమా పరిశ్రమలో చెన్న కేశవరెడ్డి, దిల్, బన్నీ, భగీరథ, అశోక్, రెడీ, కింగ్, ఆంజనేయులు, అదుర్స్, డాన్ శ్రీను, గబ్బర్ సింగ్, దరువు, సుడిగాడు, నాయక్, మిర్చిలాంటి కుర్రోడు, ఖైదీ నంబర్ 150, నేల టికెట్, డీజే టిల్లు, తదితర చిత్రాల్లో నటించాడు. ఆయన చివరిగా నటించిన చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. ఆయన దాదాపు 100 చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించారు.

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ
ఫిష్ వెంకట్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు కూడా పాడవ్వడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కిడ్నీ మార్పిడికి 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీ దాత కోసం ఎదురు చూశారు. ఆయనను అన్ని రకాలుగా ఆదుకొనేందుకు ప్రయత్నాలు విఫలమయ్యాయి. సినీ వర్గాలు ఆర్థిక సహాయం అందించడంతో కొద్దికాలంగా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే విధిరాతను తప్పించుకోలేక ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో హాస్యలోకం ఓ ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది.

More from Filmibeat

Read more about: fish venkat tollywood telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X