twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో కమెడియన్ పొట్టి వీరయ్య కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

    |

    టాలీవుడ్‌ మరోసారి విషాదంలో మునిగిపోయింది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కమెడియన్ పొట్టి వీరయ్య ఇకలేరు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    Recommended Video

    Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu

    పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఫణిగిరిలో 1967లో జన్మించారు. పుట్టకతోనే మరుగుజ్గు అయిన వీరయ్య దక్షిణాది చిత్రసీమలో 500 చిత్రాలకుపైగా నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కమెడియన్‌గా రాణించారు.

    comedian-potti-veeraiah-died-with-heart-attack

    ప్రముఖ దర్శకుడు విఠలాచార్య రూపొందించిన అగ్గిదొర చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. దర్శకరత్న దాసరి తెరకెక్కించిన చిత్రం తాతామనవడు చిత్రంతొ మంచి గుర్తింపు పొందారు.

    ఇప్పటి వరకు అగ్గివీరుడు, తాతా మనవుడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గొల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జన్ సుందరి లాంటి చిత్రాల్లో నటించారు.

    చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న వీరయ్య నటుడు అవ్వాలనే కోరికతో మద్రాస్ వెళ్లారు. నటుడు శోభన్ ‌బాబు సూచన మేరకు విఠలాచార్యను కలువగా ఆయన వేషం ఇవ్వడంతో నటుడిగా మారారు. అప్పటి నుంచి వెనుకకు చూసుకోలేదు.

    వీరయ్య వ్యక్తిగత జీవితానికి వస్తే.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య మల్లిక 2008లో అనారోగ్యంతో మరణించారు.

    సీఎం కేసీఆర్ సంతాపం..
    పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన వీరయ్య తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారని సీఎం గుర్తు చేసుకున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు సీఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    English summary
    Tollywood's Comedian Potti Veeraiah died with Heart Attack on Sunday in hyderabad. He was 54 years old. He acted 500 movies in South film industry. He acted in Telugu, Tamil, Kannada, Malayalam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X