30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీకి కీలక పదవి.. ఏపీ ప్రభుత్వంలో..

టాప్ కమెడియన్, నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కీలక పదవిని చేపట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. విద్యాధికుడైన పృథ్వీకి ముఖ్యమైన పదవిని అప్పగించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అడుగులేస్తున్నది. స్వర్గీయ ధర్మవరపు సుబ్రమణ్యం స్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ విలక్షణ నటుడు ఆ పార్టీ కోసం హై రేంజ్‌లో ప్రచారం చేశారు. గత రెండేళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వైఎస్ జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించిన సంగతి తెలిసిందే.

గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ధర్మవరపు సుబ్రమణ్యం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కీలక పదవిని పృథ్వీకి ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.

Comedian Prudhvi in race for crucial post in YS Jagan governement

వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికల ముందునే కాకుండా ఎన్నికల తర్వాత కూడా పృథ్వీ ప్రస్తుత ప్రభుత్వంపై ఈగ వాలకుండా కామెంట్లు చేస్తున్నాడు. వైఎస్ జగన్‌పై ఎలాంటి కామెంట్లు చేసినా తారాస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ఇటీవల వైఎస్ జగన్ విజయాన్ని తెలుగు చిత్ర సీమలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X