twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమెడియన్ పృథ్వీరాజ్‌కు తీవ్ర అస్వస్థత.. క్వారంటైన్‌కు తరలింపు..

    |

    నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తతో సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దాంతో ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేసి తన ఆరోగ్యం గురించి వివరాలు అందజేశారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆయన ఏం చెప్పారంటే..

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    అన్ని రకాల పరీక్షలు చేయించిన తర్వాత

    అన్ని రకాల పరీక్షలు చేయించిన తర్వాత

    నా సన్నిహితులు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు నమస్కారం. గత పది రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో, జ్వరంతో బాధపడుతున్నాను. అన్ని రకాల టెస్టులు, సీటీ స్కాన్ చేయించాను. ఒకసారి నెగిటివ్.. మరోసారి కోవిడ్ పాజిటివ్ అనే రిపోర్టులు వచ్చాయి. కానీ కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండమన్నారు అని పృథ్వీరాజ్ తెలిపారు.

     15 రోజులపాటు క్వారంటైన్‌లో

    15 రోజులపాటు క్వారంటైన్‌లో

    నాకు కోరోనా పాజిటివ్ అనే ధృవీకరించారు. దాంతో 15 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యుల చేసిన సూచన మేరకు జూన్ 3వ తేదీన నేను హాస్పిటల్‌లో చేరాను. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చేలా వెంకటేశ్వరస్వామి ఆశీస్సులను, నా అభిమానులను దీవెనలను కోరుకొంటున్నాను అని వీడియోలో పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

     ఆస్పత్రి బెడ్‌పై నుంచే వీడియో

    ఆస్పత్రి బెడ్‌పై నుంచే వీడియో

    ఎప్పుడూ చలాకీగా, ఉత్సాహంగా కనిపించే పృథ్వీరాజ్ తన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో ఆస్పత్రి బెడ్‌ పడుకొనే తన వీడియోను రిలీజ్ చేశారు. మాట్లాడుతున్నంత సేపు ఆయాసంతో కనిపించారు. దీంతో ఆయనకు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తినట్టు కనిపిస్తున్నది.

     సినీ, రాజకీయాలకు దూరంగా

    సినీ, రాజకీయాలకు దూరంగా

    నటుడిగా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన పృథ్వీరాజ్ తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత అధికార పార్టీ తరఫున గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్టీ విజయానికి కృషి చేసినందుకు పృథ్వీరాజ్‌కు టీటీడీలో కీలక పదవిని కట్టబెట్టారు. కొన్ని ఆరోపణల కారణంగా ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవడం తెలిసిందే. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

    English summary
    Comedian Pruthvi Raj health critical, sent into quarantine for 15 days. In this occassion, Comedian Pruthvi Raj released a video about his health condition. He asked fans and well wishers to pray for speedy recovery.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X