Saptagiri సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో.. టాప్ డైరెక్టర్‌తో చేతులు కలిపిన టాప్ కమెడియన్

హీరోగానూ, స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న సప్తగిరి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తన ముందుకు వస్తున్న ఆఫర్లను అంగీకరిస్తూ తన అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తున్నారు. కరోనా సమయంలో కూడా భారీ చిత్రాల్లో నటించి మెప్పించాడు. 2001లో రిలీజైన క్రాక్, అల్లుడు అదుర్స్, శ్రీకారం, శ్రీదేవి సోడా సెంటర్, మంచి రోజులొచ్చాయి, ఏక్ మిని కథ లాంటి చిత్రాల్లో కమెడియన్‌గా, గుడుపుఠాణి లాంటి చిత్రంతో హీరోగా సప్తగిరి మంచి మార్కులే సంపాదించుకొన్నారు.

మినిమమ్ గ్యారెంటీ హీరో, కమెడియన్ అనే ముద్ర వేసుకొన్న సప్తగిరి.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్, 'యజ్ఞం', 'పిల్లా... నువ్వు లేని జీవితం' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Comedian Saptagiri joins hands with Director AS Ravikumar Chowdary

నిర్మాత ఏఎస్ రిగ్వేద చౌదరి మాట్లాడుతూ.. వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను వెల్లడిస్తాం అని చెప్పారు.

సాంకేతిక నిపుణులు
కూర్పు: గౌతం రాజు
పోరాటాలు: రామ్, లక్ష్మణ్
ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్
ఆర్ట్: రమణ వంక
కో-డైరెక్టర్: మురళీధర్ రావు
పాటలు: సుద్దాల అశోక్ తేజ, కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని
సహ నిర్మాత: దేవినేని రవి
నిర్మాత: ఎ.ఎస్. రిగ్వేద చౌదరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X