ఆ రెండు చిత్రాలతో కమెడియన్‌పై విమర్శలు!
తనపై వస్తున్న విమర్శలతో తమిళ కమెడియన్ సూరి ఆగ్రహానికి గురయ్యాడు. సూరి తమిళంలో బిజీ కమెడియన్. సూరి నటించిన సీమరాజ, సామీ స్క్వేర్ చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. సీమరాజ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సామీ స్క్వేర్ చిత్రానికి మాత్రం నెగిటివ్ రివ్యూలు సినీ విమర్శకుల నుంచి వస్తున్నాయి.
ఈ రెండు చిత్రాల్లో సూరి పాత్రల గురించి, నటన గురించి ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తుండడంతో అతడు ఆగ్రహానికి గురయ్యాడు. తనపై విమర్సలు చేస్తే మీకు ఏమి లాభం అంటూ ప్రశ్నించాడు. సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేయడం వలన నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని అందురూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించాడు.

కావాలనే తమ చిత్రాలపై చేదు ప్రచారం చేస్తున్నాని సూరి మండిపడ్డాడు. సినిమాపై విమర్శలు చేయసం ఆపి కాపాడేందుకు ప్రయత్నించాలని సినీ విమర్శకులకు సూరి సూచించాడు.


Click it and Unblock the Notifications











