గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్ .. మెగాస్టార్‌ను నిలబెట్టిన వ్యక్తి ఇలా
భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ ఇండస్ట్రీలోనూ లేని విధంగా టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అదే హాస్య కుటుంబం. నాటి కస్తూరి శివరావ నుంచి నేటి వెన్నెల కిషోర్ వరకు ఎంతో మంది హాస్యనటులు తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తారు. ఎంత పెద్ద యాక్షన్ సినిమా తీసినా, చారిత్రకమైనా, జానపదమైనా, సాంఘికమైనా కామెడీకి సెపరేట్ ట్రాక్ ఉండేది. కామెడీ కోసమే కొందరు రైటర్స్ ఖచ్చితంగా ఉండేవారు. ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రాలు తీసి సూపర్‌హిట్స్ కొట్టిన చరిత్ర టాలీవుడ్ సొంతం.
ఇకపోతే.. తెలుగు హాస్య నటుల్లో సుధాకర్‌ది సెపరేట్ ట్రెండ్. ఆయన కామెడీ టైమింగ్, మేనరిజం, వాచకం, అభినయం అంతా విలక్షణంగా ఉండి నవ్వులు పూయించాయి. తొలినాళ్లలో హీరోగా, విలన్‌గా నటించిన సుధాకర్ తమిళనాడులో హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఆయన క్రేజ్ చూసి అప్పట్లోనే ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేయమంది అంటే సుధాకర్ ఛరిష్మాను అర్ధం చేసుకోవచ్చు. తమిళనాడులో హీరోగా సక్సెస్ అయిన ఆయన అనూహ్యంగా తెలుగులో మాత్రం సక్సెస్ కాలేక కమెడియన్‌గా స్థిరపడ్డారు.

రాయలసీమ ప్రాంతానికి చెందిన సుధాకర్ తండ్రి ప్రభుత్వోద్యోగి కావడంతో ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో సుధాకర్ కోరుకున్న విధంగానే నటనలో శిక్షణ తీసుకోవడానికి మద్రాస్ పంపించారు వాళ్ల నాన్న. ఆ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే చిరంజీవి, హరిప్రసాద్, నారాయణ రావులు ఆయనకు రూమ్ మేట్స్. ఈ నలుగురిలో సుధాకర్ తొలుత ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళ చిత్రాల్లో బిజీగా ఉండేవారు. ఈ క్రమంలోనే పునాదిరాళ్లు చిత్రంలో వేషం వేసే ఛాన్స్ రాగా.. అప్పటికే భారతీరాజా దర్శకత్వంలో ఓ పెద్ద సినిమాకు సుధాకర్ అంగీకరించారు.
పునాదిరాళ్లు చేస్తే నా సినిమాలో వేషం ఉండదని భారతీరాజా తేల్చిచెప్పడంతో చిరంజీవిని తీసుకుని పునాదిరాళ్లు నిర్మాతల దగ్గరికి వెళ్లి సినిమా చేయలేనని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే మెగాస్టార్ తన మిత్రుడి తరపున వాళ్లకి నచ్చజెప్పాడు. అయితే ఆశ్చర్యకకరంగా చిరంజీవి వాళ్లకి నచ్చడంతో ఎంతో బలవంతం మీద పునాదిరాళ్లులో నటించడానికి ఒప్పుకున్నాడు. అలా తన కష్టంతో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఓ రకంగా చిరంజీవి స్టార్ కావడానికి సుధాకరే పరోక్ష కారణం.
అందుకే చిరంజీవికి సుధాకర్ అంటే ఎంతో అభిమానం, ఇష్టం. సుధాకర్ నిర్మాతగా పలు చిత్రాలలో నటించడంతో పాటు కెరీర్ పరంగానూ ఆయనకు అండగా నిలిచారు చిరు. తర్వాతి కాలంలో కొత్త కమెడియన్లు రావడం, తదితర కారణాలతో సుధాకర్‌కు అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్‌కు లోనై కోమాలోకి కూడా వెళ్లారు. అలా కొన్నేళ్లపాటు నటనకు దూరమైన సుధాకర్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనను చూసిన సినీ అభిమానులు, తోటి నటీనటులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











