క్రేజీ ప్రాజెక్టులో సునీల్.. అగ్ర దర్శకులు, మెగా హీరోల చిత్రాల్లో..
కమెడియన్‌గా సునీల్ మళ్లీ బిజీగా మారిపోయాడు. అరవింద సమేత చిత్రం తర్వాత కామెడీ టచ్ ఉన్న కమెడియన్ పాత్రను తనదైన శైలిలో పోషించాడు. తాజాగా చిత్రలహరి సినిమాలో హీరోకు సమాంతరంగా ఉంటే పాత్రలో ఒదిగిపోయాడు. ఇలా బిజీగా మారుతున్న సునీల్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించబోతున్నాడు.
చిత్రలహరి సక్సెస్ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో మీడియాతో సునీల్ మాట్లాడుతూ.. మరోసారి త్రివిక్రమ్, అల్లు అర్జున్ చిత్రంలో మంచి పాత్రలో కనిపిస్తాను. మరోసారి నాకు ప్రతిభకు తగిన పాత్ర లభించింది అని అన్నారు.

అలాగే టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న చిత్రంలో అద్భుతమైన పాత్రలో కనిపిస్తాను. కాకపోతే ఆ సినిమా వివరాలు ఇప్పుడే వెల్లడించను. త్వరలోనే మీకు అధికారికంగా బయటకు తెలుస్తుంది అని అన్నారు. అయితే కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో సునీల్ నటిస్తున్నారనే అంశం మీడియాలో వైరల్‌గా మారింది.
హీరోగా పలు పరాజయాలు తారసపడటంతో మళ్లీ కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల విడుదలైన సినిమాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వడంతో కమెడియన్‌గా జోష్‌ను పెంచుతున్నారు.


Click it and Unblock the Notifications











