కమెడియన్ సునీల్ చేతిలో చెడ్డీ గ్యాంగ్ తమాషా.. ఫుల్ ఫన్‌తో ఆకట్టుకొన్న టీజర్
లాక్‌డౌన్ తర్వాత భారీ చిత్రాల కంటే..చిన్న బడ్జెట్ చిత్రాలు సందడి చేస్తున్నాయి. విభిన్నమైన, విలక్షణ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నారు. అదే కోవలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. అబుజా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీలీల ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను, టీజర్‌ను స్టార్ కమెడియన్ సునీల్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ అబుజా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీలీల ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా శ్రీ క్రాంతి కిరణ్ నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా తెరకెక్కిన చెడ్డీగ్యాంగ్ తమాషా టైటిల్ ఆకట్టుకొనేలా ఉంది. కామెడీకి పెద్ద పీట వేసిందనే విషయం టైటిల్‌తో స్పష్టమైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి కొత్త అనుభూతిని పొందాలి. సినిమా పరిశ్రమలోకి వచ్చే కొత్త నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకొంటున్నాను అని చెప్పారు.

.
నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. కమెడియన్ సునీల్ చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్, టీజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు.
నటీనటులు: వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ తదితరులు
సినిమాటోగ్రఫి: జీకే యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
సాహిత్యం: విహారి
ఎడిటింగ్: నర్సింగ్ రాథోడ్
ఆర్ట్: రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను
నిర్మాత: సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: వెంకట్ కళ్యాణ్


Click it and Unblock the Notifications











