కమెడియన్ వేణు మాధవ్ అంత్యక్రియలు ఎప్పుడు? ఎక్కడంటే!
ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ అకాల మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ యశోద హాస్పిటల్లో బుధవారం (25.09.2019), మధ్యాహ్నం 12 గంటల, 20 నిమిషాలకు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 51 సంవత్సరాలు. వేణు మాధవ్ మరణవార్తను అభిమానులు జీర్ణించుకోవడం కష్టంగా మారింది. సన్నిహితులు, స్నేహితులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) విచారం వ్యక్తం చేసింది.
వేణు మాధవ్ అంత్యక్రియల గురించి మా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన పార్ధీవ దేహాన్ని గురువారం (26.09.2019)న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల, 30 నిమిషాల వరకు, అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కాంప్లెక్స్ ఆవరణలో ఉంచబడును. అనంతరం మౌలాలిలో అంత్య క్రియలు నిర్వహించ బడును అని 'మా' ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ ప్రకటనలో తెలిపారు.

కాగా, మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమా పరిశ్రమకు పరిచయమై కమెడియన్‌గా, హీరోగా వెండితెరపై వేణు మాధవ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా నటించారు. అనారోగ్యం బారిన పడటంతో సినిమాలకు దూరమయ్యాడు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ యశోద హాస్పిటల్‌లో మృతి చెందిన వేణు మాధవ్ భౌతిక కాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు.


Click it and Unblock the Notifications











