ఆ కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిన వేణు మాధవ్!
Recommended Video
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు. క్రమంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందారు. ఈయన మృతి టాలీవుడ్ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. వేణు మాధవ్ బలమైన కోరిక తీరకుండానే మృతి చెందడం పలువురిని తీవ్రంగా కలచివేస్తోంది.

అలుపెరగని సినీ ప్రయాణం
సినిమా ఇండస్ట్రీలో వేణుమాధవ్ అలుపెరగని ప్రయాణం చేశారు. 20 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా కొనసాగిన ఆయన 400 పైగా సినిమాల్లో నటించారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తిగా ఉండే ఆయన వెండితెరపై రాణించారు.

వేణు మాధవ్ బలమైన కోరిక
వేణు మాధవ్ కి ఓ బలమైన కోరిక ఉండేది. రాజకీయాల్లోనూ రాణించాలనే ఆకాంక్ష ఉన్నట్లు ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. గతంలో టీడీపీ తరపున పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కానీ చివరకు ఆ కోరిక తీరకుండానే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే కావాలనుకున్నారు.. కానీ చివరకు
తన సొంత ఊరు కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎంతగానో ప్రయత్నించారు. 2014 సంవత్సరం కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్.. కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేక పోయారు. ఆ తర్వాత మెల్లగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన కోరిక తీరకుండానే చివరకు కన్నుమూశారు.

సినీ ప్రముఖుల సంతాపం
వేణు మాధవ్ మరణ వార్త తెలిసి టాలీవుడ్ సర్కిల్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. వేణు మాధవ్ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











