Pushpa రియల్ సీన్: నా కాలు మీద నేను వేసుకుంటే తప్పేంటి.. ఐదేళ్ల క్రితమే స్టార్ హీరోతో వేణు మాధవ్

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న సినిమాల్లో పుష్ప టాప్ లిస్ట్ లో నిలిచింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త ఒరవడి సృష్టించింది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ తో పాటు డాన్స్ మూమెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పుష్పకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ వేణుమాధవ్ గతంలోనే వేణు మాధవ్ తన జీవితంలో జరిగినట్లుగా చేసిన ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతీ ఒక్క డైలాగ్..

ప్రతీ ఒక్క డైలాగ్..

పుష్ప సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణను అందుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం కొన్ని డైలాగ్స్ అయితే స్టార్ క్రికెటర్స్ అలాగే ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఇమిటేట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తగేదేలే డైలాగ్ తో పాటు అంతేకాకుండా కాలు మీద కాలు వేసుకుని సీన్ కూడా బాగా పాపులర్ అయింది.

కాలు మీద కాలు వేసుకుని..

కాలు మీద కాలు వేసుకుని..

సినిమా మొదట్లోనే హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేసే విధంగా దర్శకుడు సుకుమార్ పుష్ప యాటిట్యూడ్ ని చూపించడం బాగానే క్లిక్ అయింది. ఒక ఓనర్ ఎదురుగా వస్తున్నప్పుడు హీరో కాలు మీద కాలు వేసుకుని ఉన్నప్పుడు అలా ఎందుకు వేసుకొని ఉన్నావు అని మరొక వ్యక్తి అడిగినప్పుడు చాలా విభిన్నంగా సమాధానం ఇస్తాడు. నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పు ఏమిటి అని చెప్పడంతో ఆ డైలాగ్ బాగా క్లిక్ అయింది.

 అదే డైలాగ్ తో పుష్పకు బీజం

అదే డైలాగ్ తో పుష్పకు బీజం

లాజికల్ గా కూడా ఆ డైలాగ్ కరెక్ట్ గా ఉండటంతో సోషల్ మీడియాలో జనాలకి చాలా ఈజీగా ఎక్కేసింది. అయితే ఈ డైలాగ్ ఎలా వచ్చింది అని అడిగినప్పుడు సుకుమార్ ఒక సమాధానం ఇచ్చాడు. తన సోదరుడు ఒకసారి ఇదే తరహాలో ప్రవర్తించాడని అందుకే సినిమాలో పెట్టడం జరిగినట్లుగా తెలిపాడు. ఒక విధంగా పుష్ప సినిమాకి బీజం కూడా అలానే పడినట్లుగా సుక్కు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

 ఐదేళ్ల క్రితమే వేణుమాధవ్

ఐదేళ్ల క్రితమే వేణుమాధవ్

దాదాపు సినిమాలో నాలుగైదు సన్నివేశాల్లో అల్లు అర్జున్ అదే తరహాలో కాలు మీద కాలు వేసుకుని కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ డైలాగ్ ను ఐదేళ్ల క్రితమే వేణుమాధవ్ చెప్పడం విశేషం. వేణు మాధవ్ చనిపోయే కొన్ని నెలల ముందు ఇచ్చిన TNR ఇంటర్వ్యూలో పుష్ప తరహా సన్నివేశం అతని జీవితంలో కూడా చోటు చేసుకున్నట్లుగా చెప్పాడు. బహుశా వేణు మాధవ్ ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా గురించి ఆలోచించి కూడా ఉండడు.

ఏ నా కొడుకు చెప్పారు

ఏ నా కొడుకు చెప్పారు

ఇక వేణుమాధవ్ చనిపోయి కూడా చాలా కాలం అవుతుంది. ఇక ఒక ఇంటర్వ్యూలో వేణుమాధవ్ ఒక రోజు స్టార్ హీరోతో ఎదురైనా ఒక అనుభవం గురించి చెప్పాడు. ఏమయ్యా నువ్వు ఎవరు వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకుని ఉంటావ్ అంట కదా అని అడిగాడు. అయితే మీకు ఏ నా కొడుకు చెప్పారు అని వేణు మాధవ్ ప్రశ్నించడట. అందుకు ఆ హీరో వెంటనే ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేయబోయారట.

 నా కాలు మీద నేను వేసుకుంటే తప్పేంటి..

నా కాలు మీద నేను వేసుకుంటే తప్పేంటి..

అప్పుడు వేణుమాధవ్ మీతో కరెక్ట్ ఏం చెప్పారో చెప్పండి అని ఆడిగినప్పుడు.. కాలు మీద కాలు వేసుకుంటావ్.. అని తనతో అన్నారని సదరు హీరో ఆన్సర్ ఇచ్చాడట. అందుకు వేణు మాధవ్.. అయినా నా కాలు మీద నేను వేసుకుంటే తప్పేంటి.. పక్కోడి కాలు మీద వేస్తే తప్పు గాని అని సమాధానం ఇవ్వడంతో కొంత సేపటి వరకు ఆ హీరో సైలెంట్ గా ఉండిపోయాడట.

Recommended Video

RGV Goes Gaga Over Pushpa | Allu Arjun Believed In Guts || Filmibeat Telugu
అదే తరహాలో పుష్పలో కూడా..

అదే తరహాలో పుష్పలో కూడా..

నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా ఆ హీరో అన్నాడట. అయినప్పటికీ వేణుమాధవ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన ఫ్యామిలీలో అందరికీ ఇదే తరహాలో కాలు మీద కాలు వేసుకునే అలవాటు ఉందని.. అయినా మన కాలు మీద మన కాలు వేసుకుంటే తప్పు ఏమిటి అని వివరణ ఇచ్చాడు. ఇక అదే తరహాలో సుకుమార్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో చెప్పించడం వైరల్ గా మారుతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X