Viva Harsha : ఘనంగా అక్షరతో వారం రోజుల ప్రేమ పెళ్లి.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారంటే?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు వరుసగా పెళ్లి బాట పడుతున్నారు. హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు అందరూ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించు కోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష తన ప్రేయసి అక్షరతో ఏడడుగులు నడిచారు. ఇంతకీ అక్షర ఎవరు? వారిద్దరి మధ్య ఎలా ప్రేమ మొదలైంది? అనే వివరాల్లోకి వెళితే

హర్ష చెముడు

హర్ష చెముడు

విశాఖపట్నానికి చెందిన హర్ష చెముడు ఇంజనీరింగ్ రోజుల్లోనే వైవా అనే పేరుతో వరుస వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, ఆయన సోదరుడు శబరీష్ హర్ష కలిసి కాలేజీలో వైవా జరుగుతున్నపుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలను ఫన్నీ గా చూపించే ప్రయత్నం చేశారు. అందులో పేరు రావడంతో హర్ష కు వైవా హర్ష అనే పేరు స్థిరపడిపోయింది.

కమెడియన్ గా మంచి పేరు

కమెడియన్ గా మంచి పేరు

అలా వచ్చిన క్రేజ్ తో హర్ష వరుసగా సినిమా అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి. అలా సినిమా రంగంలో తనకంటూ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు హర్ష. కమెడీయన్ గా కెరీర్ ప్రారంభించి ఆహా అలాంటి సంస్థ కోసం కొన్ని షోలు కూడా చేసిన అనుభవం వుంది.

30 ఏళ్ల హర్ష తనకు నాలుగేళ్ల నుంచి పరిచయం ఉన్న అక్షరతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ వేడుకలు వారం రోజుల పాటు జరగగా అనేక మంది సెలబ్రిటీలు వారి వివాహానికి హాజరై తమ ఆశీస్సులు అందించారు.

ప్రేమ పెళ్లి

ప్రేమ పెళ్లి

అయితే తమ ప్రేమ పెళ్లి అంత ఈజీగా ఏమీ జరగలేదని వైవా హర్ష అంటున్నారు. నిజానికి ముందు తనకు నేను ప్రపోజ్ చేయలేదని ఇక నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనే విషయం అక్షర చెబితే అక్షర నన్ను చేసుకుంటావా అని అడిగింది అని చాలా క్యూట్ గా అనిపించడంతో వెంటనే ఒప్పేసుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి విషయం గురించి మా ఇంట్లో పెద్దగా ఇబ్బందులు తలెత్త లేదు కానీ అక్షర వాళ్ళ నాన్న ఒప్పుకోవడానికి కొంత కాలం పట్టిందని చెప్పుకొచ్చారు.

ఎట్టకేలకు ఒక ఇంటి వాడు

ఎట్టకేలకు ఒక ఇంటి వాడు

అక్షర తల్లి కి తను తెలుసు కాబట్టి ఆమె వెంటనే ఒప్పుకున్నారు కానీ నేను ఎవరు అక్షర తండ్రికి తెలియదు కాబట్టి నేను పరిచయమై కొన్నాళ్లు ట్రావెల్ చేశాక అప్పుడు ఆయన మా పెళ్లికి ఒప్పుకున్నారు అని హర్ష చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఎట్టకేలకు వైవా హర్ష ఒక ఇంటి వాడు అవడంతో సినీ సెలబ్రిటీల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హర్ష పెళ్లికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Recommended Video

Hero Harsha Narra Making Fun Of Team In Bus Tour | Missing Movie
ఏడు రోజుల పాటు పెళ్లి

ఏడు రోజుల పాటు పెళ్లి

ఏడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకల్లో వధూవరుల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. దర్శకుడు మారుతి, నటుడు ప్రవీణ్‌, స్వాతి రెడ్డి, మహాతల్లి ఫేమ్‌ జాహ్నవి పాల్గొని వధూవరులకు అభినందనలు తెలిపారు. మరోవైపు సుహాస్‌ కథానాయకుడిగా నటించిన 'కలర్‌ఫొటో'లోనూ హర్ష తనదైన నటనతో మెప్పించారు. ఇటీవల విడుదలైన సందీప్ కిషన్ గల్లీ రౌడీ లో కూడా హర్ష నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X