నాంది టీజర్.. న్యాయం చెప్పడానికి ఇన్నేళ్లు ఎందుకు? ఆలోచింపజేస్తున్న నరేష్ న్యూ కాన్సెప్ట్!

కామెడీ హీరోగా ఒకప్పుడు చాలా బిజీగా గడిపిన అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం రూట్ మార్చాడు. ఆడియెన్స్ కి కామెడీ పాత్రలు బోర్ కొట్టేశాయని భావించిన నరేష్ మొత్తానికి కొత్త దారిని సెట్ చేసుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన నాంది అనే సినిమాతో రాబోతున్నాడు. నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.

నాంది టీజర్..

నాంది టీజర్..

సినిమా టీజట్ చూస్తుంటే అల్లరి నరేష్ ఈ సారి ఒక డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకునేలా ఉన్నాడనిపిస్తోంది. సినిమా కథ ఎక్కువగా ఒక జైల్లోనే కోనసాగుతుందని అర్ధమవుతోంది. ఇక నేరము చేశారో.. చేయలేదో తెలియని ఖైదీలు జైళ్లలోనే ఏళ్లతరబడి శిక్ష అనుభవిస్తున్నారనే కొత్త పాయింట్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. టీజర్ కి హరీష్ శంకర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది.

హరీష్ శంకర్ వాయిస్ ఓవర్..

హరీష్ శంకర్ వాయిస్ ఓవర్..

2015 నాటికి 1401 జైళ్లు ఉంటే.. 3,66,781 మంది రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే అందులో దాదాపు 2,50,000 మంది నేరం చేశారో లేదో తెలియకుండానే అండర్ ట్రైల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు అని హరీష్ శంకర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

అల్లరి నరేష్ యాక్టింగ్..

అల్లరి నరేష్ యాక్టింగ్..

ఇక అల్లరి నరేష్ లుక్ యాక్టింగ్ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది. దాదాపు సినిమా కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించడానిపిస్తోంది. ఇక టీజర్ చివరలో చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తోంది. 'ఒక మనిషి పుట్టడానికి 9 నెలలే టైమ్ పడుతుంది. కానీ నాకు న్యాయం చేప్పడానికేంటి సర్..ఇన్ని సంవత్సరాలు పడుతోంది..' అని అల్లరి నరేశ్ స్ట్రాంగ్ లైన్ తో సినిమాపై అంచనాల డోస్ పెంచేశాడు.

Recommended Video

Actor Naresh Starts Dubbing For Jathi Ratnalu movie

ఎవరు చూపించని కొత్త పాయింట్..

ఇంతవరకు ఎవరు చూపించని విధంగా సినిమాలో కొత్త తరహా అంశాన్ని సినిమాలో చూపించనున్నట్లు అర్ధమవుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇక కోలీవుడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, హరీష్, ప్రవీణ్ సరికొత్త పాత్రలతో కనిపించనోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X