కాంట్రావర్సీ దెబ్బకు రిలీజ్ డేట్ ఫిక్స్.. కమిట్ మెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?
ఈ మధ్య కాలంలో సినిమాలో ఏ విషయం చూపించాలి అన్నా దర్శక నిర్మాతలు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి, చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తున్నారు కొంతమంది. అయితే కొన్నిసార్లు కావాలనే దర్శకనిర్మాతలు తమ తమ సినిమాల్లో అభ్యంతరకరమైన విషయాలను చూపిస్తూ కాంట్రవర్సీలకు తెర లేపుతున్నారు. తాజాగా కమిట్మెంట్ అనే సినిమా యూనిట్ కూడా అదే విధంగా ఒక కాంట్రవర్సీకి తెరలేపింది. కాంట్రవర్సీ అయిందని తెలిసిన వెంటనే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

టీజర్ విడుదల
ఈ మధ్యకాలంలో ఏదైనా మతాలకు వ్యతిరేకంగా సినిమాలలో చూపించినా కాస్త ఇబ్బందికర సన్నివేశాలు ఏవైనా సరే వెంటనే వివాదాస్పదమవుతున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మొత్తం మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఒక వర్గం వారు సోషల్ మీడియాలో మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా కమిట్మెంట్ అనే సినిమా కూడా అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకుంది తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ విడుదల చేశారు.

అధికారికంగా
టీజర్ లో నాలుగు జంటలు లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోతున్న సమయంలో వెనుక భగవద్గీతకు సంబంధించిన ఒక శ్లోకం వినిపిస్తూ ఉండడంతో ఈ సినిమా అనూహ్య పరిస్థితుల్లో వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలో సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తామంటూ హిందుత్వవాదులు భారీ ఎత్తున విరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. తాజాగా కమిట్మెంట్ అనే సినిమా అని ఆగస్టు 19వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

కీలక పాత్రలలో
ఈ సినిమాలో బిగ్ బాస్ సేమ్ తేజస్వి మదివాడ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమానే "కమిట్ మెంట్ ". ఈ సినిమాలో తేజస్వి మడివాడ , అన్వేషి జైన్ , సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి .వీరు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సెన్సార్ పూర్తి
ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చిందని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.

మంచి అవుట్ పుట్
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బల్దేవ్ సింగ్ సహా నీలిమ తాడూరి గారు మాట్లాడుతూ.. మంచి ప్రయత్నం గా ఈ సినిమా నిర్మించామని మా సినిమా పనిచేసిన ప్రతి ఒక్క నటి నటులు టెక్నిషియన్ సపోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారని వెల్లడించారు. వివాదాస్పదంగా మారిన ఈ సినిమా ప్రేక్షకులను ఈ మేరకు ఆకట్టుకోనుంది అనేది చూడాలి మరి.


Click it and Unblock the Notifications











