అమ్మాయి కోసం ప్రభాస్, గోపీ చంద్ గొడవ.. ఇప్పుడామె స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలో మొత్తంలో బిగ్గేస్ట్ స్టార్ గా ఎదిగారు మన డార్లింగ్ ప్రభాస్. 'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. డార్లింగ్ చిత్రాల కోసం ఎంత ఎదురుచూస్తున్నారో తెలిసిందే. చివరిగా 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాడు ప్రభాస్. ప్రస్తుతం అప్ కమింగ్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కటిగా ఆయన సైన్ చేసిన చిత్రాలను ఫినిష్ చేసుకుంటూ వస్తున్నారు

ప్రస్తుతం 'రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు ప్రభాస్. ఇప్పటికే ఏడాదికి రెండు సినిమాలు ఫినిష్ చేస్తానని తన డైహార్ట్ ఫ్యాన్స్ కు హామీనిచ్చిన ప్రభాస్ అందుకు తగ్గట్టుగానే కృషి చేస్తున్నాడు. నిర్విరామంగా షూటింగ్స్ తోనే సమయం గడుపుతున్నారు. ప్రభాస్ ను ప్రస్తుతం అభిమానులు వెండితెరపై తప్పా మరెక్కడా చూసే అవకాశం లేదు. సినిమా రిలీజ్ ఫంక్షన్స్, ప్రమోషన్స్ లోనూ సెక్యురిటీ దృష్ట్యా పెద్దగా పాల్గొనడం లేదు డార్లింగ్.

Conflict Between Rebel star Prabhas and Hero Gopichand for a Girl Here is her Details

అయితే గతేడాది మాత్రం తన అభిమానులకు అలాంటి ఫీలింగ్ ఉండొద్దనే భావనతో నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్టీకే' సెకండ్ సీజన్ కు హాజరైన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఒక్కడే కాదు.. డార్లింగ్ కు ఎంతో ఇష్టమైన హీరో గోపీచంద్ కూడా హాజరయ్యారు. వీరిద్దరి ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంటుందో తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా ప్రభాస్ ఎక్కువగా గోపీచంద్ తోనే గడుపుతాడని డార్లింగే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

అయితే బాలకృష్ణ షోకు హాజరైన ప్రభాస్, గోపీ చంద్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి, గోపీతో ఫ్రెండ్షిష్ గురించి ప్రశ్నలు సంధించిన బాలయ్య ఓ కాంట్రవర్షియల్ క్వశ్చన్ కూడా అడిగారు. 'గోపీచంద్ కు నీకు మధ్య ఓ అమ్మాయి వల్ల గొడవైందంట? నిజమేనా' అని అడిగారు. అందుకు గోపీచంద్ గతంలో జరిగిదంటూ తన ముఖ కదలికలతో హింట్ ఇచ్చాడు. కాగా.. తాజాగా ఆ అమ్మాయి ఎవరన్నది తెలిసిపోయింది. ఏ అమ్మాయి వల్ల ప్రభాస్, గోపీ చంద్ వల్ల గొడవ జరిగిందో ఆమె పేరును, షాకింగ్ విషయాలను సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ వెల్లడించారు.

Conflict Between Rebel star Prabhas and Hero Gopichand for a Girl Here is her Details

డైరెక్టర్ గీతా కృష్ణ ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన మాట్లాడుతూ.. బాలయ్య షోలో ప్రభాస్, గోపీచంద్ మధ్య అమ్మాయి వల్ల జరిగిన ఇష్యూ ఇదే.. ఇప్పటి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గతంలో గోపీచంద్ తో కలిసి ఉండేది... మన ఫ్లాట్ వెనకాలే ఉండేవారు. ఏడాదికి పైగా కలిసి ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ తో ఆ అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా వారి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక ప్రభాస్, అనుష్క డేటింగ్ రూమర్లపై పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అది నిజమైతే వారే చెబుతారు కాదా..' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గీతా కృష్ణ మాటలు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గ్గా మారాయి.

More from Filmibeat

Read more about: actors prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X