Sai Dharam Tej కోమాలోనే ఉన్నారా? మరి లైవ్ ఎలా చూశారు.. ఎవరి మాట నమ్మాలి?

సెప్టెంబర్ 10న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌యాక్సిడెంట్ గురయిన సంగతి తెలిసిందే. అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉన్నారు ? మరో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని వార్తలు వచ్చాయినా ఎందుకు డిశ్చార్జ్ కాలేదు? అసలు తేజ్ నిజంగా కోలుకుంటున్నారా ? కోలుకుంటే ఇంతవరకు ఎందుకు డిశ్చార్జ్ కాలేదు? వాడు ఇంకా కోమాలోనే ఉన్నాడని పవన్ ఎందుకన్నారు? అనే అంశాల మీద దేవా కట్టా పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

తేజ్ కి ఎలా ఉంది?

తేజ్ కి ఎలా ఉంది?

సెప్టెంబర్ 10న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ కి గురయిన సంగతి తెలిసిందే. ఆరోజే ఆయనను అపోలో హాస్పిటల్ లో చేర్పించగా అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు కాలర్ బోన్ డిస్ లొకేట్ కావడంతో ఆయనకు సర్జారీ చేశారు. అయితే కొన్నాళ్ల పాటు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ యాజమాన్యం తరువాత లైట్ తీసుకుంది. మీడియా కూడా విమర్శలు పాలవడంతో పాటు మరిన్ని సెన్షేషనల్ ఇష్యూస్ వెలుగులోకి రావడంతో సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి. ఈ క్రమంలో మెగా మేనల్లుడు ఎలా ఉన్నాడనే విషయంపై ఆరా తీస్తున్నారు అభిమానులు.

పవన్ ఒకలా

పవన్ ఒకలా

నిజానికి తేజ్ బాగానే ఉన్నాడని అందరూ చెబుతున్నారు. హాస్పిటల్‌కు వెళ్లొచ్చిన వాళ్లు కూడా సాయి బాగానే ఉన్నాడు.. కోలుకుంటున్నాడు.. త్వరలోనే బయటకు వస్తారు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా సాయి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. కానీ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో అందరికి భయం పట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని పవన్ అనడంతో మొన్న ఎప్పుడో జరిగిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విషయాన్నీ కూడా ఇంకా మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఆ వేడుకలో పవన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో సహా సాయి ధరమ్ తేజ్ కోరుకుంటున్నారని చెబుతున్నారు. నిజంగా పవన్ చెప్పినట్లు సాయి ఇంకా కోమాలోనే ఉన్నాడా.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని దాస్తున్నారా అనే విషయంపై కన్ఫ్యూజన్ కొనసాగుతుంది.

దేవా కట్టా అలా

దేవా కట్టా అలా

అయితే ఈ విషయం మీద రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవా కట్టా తాజాగా చేసిన వ్యాఖ్యలు సాయి తేజ్ ఆరోగ్యంపై మరిన్ని అనుమానాలు వచ్చేలా చేశాయని అంటున్నారు. " సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడని, నిజానికి సాయికి జరిగిన మాదం ప్రాణాంతకం అయినా అదృష్టం కొద్దీ సాయి ఎటువంటి శాశ్వత గాయాలు లేకుండా బయట పడ్డాడని, అతను మనుషులతో మాట్లాడుతున్నాడని, ఆహారాన్ని కూడా తేలికగా తీసుకోవడం ప్రారంభించాడని చెప్పుకొచ్చారు. సాయి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చూశాడన్న దేవా అక్టోబర్ 1 న సినిమాను విడుదల చేయాలని అతను కోరుకుంటున్నాడు, "అని పేర్కొన్నారు.

అందుకే రావద్దని చెప్పాం

అందుకే రావద్దని చెప్పాం

"అయితే అంతా బాగా ఉంటే తేజ్ బయటకు ఎందుకు రావడం లేదని అనుకోవచ్చు, కానీ అర్థం చేసుకోండి, తేజ్ ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యాడు, మరియు COVID-19 ఇంకా ఉన్నందున, అతను బయటకు రావడం సురక్షితం కాదు. ఏదైనా జరిగితే అతని శరీరం బహుళ ఇన్ఫెక్షన్లతో పోరాడటం కష్టమవుతుంది. కాబట్టి, మేము ఉద్దేశపూర్వకంగా అతడిని ప్రమోషన్ల నుండి దూరంగా ఉంచాము, "అని దేవా కట్టా తెలిపారు.

Recommended Video

Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
ఎవరు అబద్ధం చెబుతున్నారు

ఎవరు అబద్ధం చెబుతున్నారు

మరి పవన్ కళ్యాణ్ ఏమో సాయి ధరమ్ తేజ్‌ ఇంకా కోమాలో ఉన్నాడని చెప్పాడు కదా మరి దేవా కట్టా ఎప్పుడు సాయిని కలిసాడు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా చూశాడు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఈ విషయంలో ఎవరు అబద్ధం చెబుతున్నారు అనేది అంశం మీద పెద్ద చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ విషయంలో సాయి కుటుంబ సభ్యులు అసలు ఎలా ఉంది పరిస్థితి అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుండని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X