‘చిరంజీవి మూవీ ఫ్లాప్ అంటూ.. రిలీజ్‌కు ముందే పొలిటికల్ పార్టీ కుట్ర’
సంక్రాంతి బరిలో దిగిన మరో తెలుగు సినిమా నారి నారి నడుమ మురారి. ఈ చిత్రంలో యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు భాను భోగవరపు కథను అందించగా, నందు సావిరిగన డైలాగ్స్, గుణశేఖర్ వీఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ..

భోళా శంకర్ సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని రాజకీయ వర్గాలు పనిగట్టుకొని దుష్రచారం చేశారు. సినిమా విడుదలకు ముందే ఫ్లాప్ అని ప్రచారం చేశారు. ముందే మీమ్స్ రెడీ చేసుకొని సోషల్ మీడియా డెకాయిట్స్ అరాచకం సృష్టించారు. టైమ్ చూసి దెబ్బ కొట్టారు. పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యారు అని మీమ్స్ తయారు చేసిన వాళ్లే నాకు స్వయంగా చెప్పారు. మీమ్స్ తయారు చేసి మాకు పంపించారని వాళ్లు చెప్పారు అని నిర్మాత అనిల్ సుకర తెలిపారు.
భోళాశంకర్ సినిమాకు ఓపెనింగ్స్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సినిమా రీమేక్. ఈ సినిమాను కోవిడ్‌కు ముందే మొదలుపెట్టాం. కోవిడ్‌లో ఆ సినిమాను అందరూ చూశారు. ఈ సినిమాలోని బలమైన పాయింట్ ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాపై దారుణంగా నెగిటివ్ ప్రచారం జరిగింది. కొన్ని కేసుల్లో బిజీగా ఉండటం వల్ల నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోయాం. దాంతో మాకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ విషయాల వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను అని అనిల్ సుంకర్ చెప్పారు.
భోళాశంకర్ సినిమాపై దుష్ప్రచారం చేసిన వాళ్లను కర్మ వెంటాడింది. మాపై నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్లు జైల్లో ఉన్నారు. వారి కర్మను వారు అనుభవిస్తున్నారు. మాకు ఏ సంబంధం లేకుండా మాపై కక్ష కట్టారు. మాపై శతృత్వం పెంచుకొన్న వాళ్లపై మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ వారిని వాళ్ల కర్మే వెంటాడుతున్నది అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











