twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Crazy Uncles వివాదం.. ఆ బూతులేంటి?...రంగంలోకి మహిళా సంఘాలు?

    |

    శ్రీముఖి లీడ్ రోల్ లో రూపొందించబడిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ రోజు విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా విడుదల కూడా కాకుండానే ట్రైలర్ లో మహిళలను కించపరిచే డైలాగులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నతరుణంలో సినిమాను అడ్డుకుంటామని మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Anchor Sreemukhi About Her Movie Career
    ఫ్రీ పబ్లిసిటీ

    ఫ్రీ పబ్లిసిటీ

    సత్తిబాబు దర్శకత్వంలో సింగర్ మనో, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, బండ్ల గణేష్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తుండగా శ్రీముఖి లీడ్ రోల్ లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్. అయితే ముందు నుంచి ఈ సినిమా మీద అంత బజ్ లేకపోయినా సరే ఒక్క సారిగా సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా మీద ఆసక్తి పెరిగి పోయింది. కేవలం సినిమాకి ఒక్కరోజు ముందు రంగంలోకి దిగిన మహిళా సంఘాలు సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ సినిమాకి మరింత పబ్లిసిటీ తెచ్చి పెట్టినట్టు అయింది.

    ఫ్యామిలీ సిస్టం మీద తీవ్ర ప్రభావం

    ఫ్యామిలీ సిస్టం మీద తీవ్ర ప్రభావం

    ఈ సినిమా ట్రైలర్లో మహిళలను కించపరిచే విధంగా డైలాగులు ఉన్నాయని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేగాక ఈ ట్రైలర్ లో ఉన్న డైలాగులను తొలగించాలని తెలంగాణ మహిళా ఐక్యవేదిక సెక్రటరీ రత్న డిమాండ్ చేశారు. నిన్న సోమాజిగూడ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. క్రేజీ అంకుల్ సినిమాలో మహిళలను కించపరిచే విధంగా డైలాగులు పెట్టడం సరికాదని ఆమె అన్నారు. అంతేకాక ఇండియన్ ఫ్యామిలీ సిస్టం మీద తీవ్ర ప్రభావం చూపే విధంగా ఇలా సినిమాలు చేయడం విచారకరమని ఆమె అన్నారు.

    దారుణం

    దారుణం

    అదీ కాకుండా మహిళల పేరుతో హాస్యం సృష్టించడం దారుణం అని కూడా ఆమె పేర్కొన్నారు. హాస్యం పేరుతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ మానవ సంబంధాలు చెడగొట్టే విధంగా సినిమాలు చేస్తే సహించమని ఈ సినిమాను వెంటనే విడుదల కాకుండా నిలిపివేయాలని క్రేజీ అంకుల్స్ సినిమాలో అభ్యంతరకర సంభాషణలు కూడా తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. సినిమా విడుదల కనుక నిలిపి వేయకుంటే మేము థియేటర్ల వద్ద అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకూ మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    బూతే కావాలా

    బూతే కావాలా

    భార్యలు చూడడానికి తప్ప... పనికిరారు అనే డైలాగు చాలా అసభ్యకరంగా ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్లో బండ్ల గణేష్ సినిమా హీరోయిన్ల ఒక డైలాగ్ చెబుతూ ఉండగా ఇప్పుడు ఆయన కూడా వివాదంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన మాత్రమే కాక సినిమాలో నటించిన అందరి మీద నిన్న ప్రెస్ మీట్ లో ఆరోపణలు గుప్పించారు. సింగర్ మనో, రాజా రవీంద్ర వంటి వారందరినీ లాగుతూ వాళ్ళు ఇలాంటి సినిమా చేస్తారని అనుకోలేదు అని విమర్శించారు. ఈ సినిమాను నిర్మించిన వారు గతంలో ఈ రోజుల్లో అనే సినిమా తీశారని అది బూతు సినిమాగా పేరు తెచ్చుకోగా ఈ సినిమా ద్వారా కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

     సడన్ బజ్

    సడన్ బజ్

    అయితే ముందు నుంచి ఈ సినిమా కోసం చేసిన పబ్లిసిటీ ఒక ఎత్తయితే సినిమా రిలీజ్ కి ఒక రోజు ముందు చెలరేగిన ఈ వివాదం మరో ఎత్తు అని చెప్పాలి. ఒక రకంగా సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా ఈ వివాదం ద్వారా ఏర్పడిందని అంటున్నారు. ఈ రోజు విడుదల ఆపడం అంటే సాధ్యమయ్యే పని కాదు. అడ్డుకోవడం కూడా సాధ్యం అయ్యే పని కాదు కానీ ఒకరోజు ముందు మీడియాకి ఎక్కడంతో సినిమా గురించి అందరికీ తెలిసేట్టు చేసినట్లయింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

    English summary
    Telangana mahila sangam demands to stop screening of movie Crazy Uncles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X