twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ వివాదం ముదురుతోంది!

    |

    నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచే హాట్ టాపిక్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఐకానిక్ మూవీ 'గ్యాంగ్ లీడర్' పేరునే ఈ చిత్రానికి వాడుకుంటున్నారు.

    ఈ సంగతి పక్కన పెడితే ఈ టైటిల్ మేము ముందే రిజిస్టర్ చేయించాం... మీరెలా వాడుకుంటారు? అంటూ ఎస్ఎంకె ఫిల్మ్స్ వారు రంగంలోకి దిగారు. కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ గొడవ తర్వాత 'నాని గ్యాంగ్ లీడర్' అంటూ టైటిల్ మార్చారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్లో కూడా ఇదే టైటిల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

    Controversy over Nani Gang Leader Movie Title

    నాని అనే పదాన్ని చిన్నగా పెట్టి 'గ్యాంగ్ లీడర్' అనే వర్డ్ పెద్దగా కనిపించేలా టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే ఎస్ఎంకె ఫిల్మ్స్ వారు 'గ్యాంగ్ లీడర్' అనే పదాన్ని మొత్తం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదరక పోవడంతో మైత్రి మూవీ మేకర్స్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

    'గ్యాంగ్ లీడర్' సినిమా విషయానికొస్తే... ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్‌లోని ప్రతి షాట్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా ఉంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు సమాచారం.

    ఈ చిత్రంలో 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

    English summary
    Controversy over Nani Gang Leader Movie Title. Gang Leader produced by Naveen Yerneni Y. Ravi Sankar Mohan Cherukuri under Mythri Movie Makers banner and written & directed by Vikram Kumar. The film stars Nani in the lead role. The music is composed by Anirudh Ravichander.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X