Coolie: కూలీ కోసం హాలీడే డిక్లేర్.. ఉద్యోగుల‌కు కంపెనీ డబ్బుతో బంపర్ ఆఫర్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు రూ.370 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్‌‌లు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

హాట్ కేకుల్లా కూలీ టికెట్లు
రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ ఉండటంతో కూలీ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూలీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్ల కోసం ఎగబడుతున్నారు ప్రేక్షకులు. కూలీని ఫస్ట్ డే చూడాల్సిందేనన్న ఊపుతో ఉన్న అభిమానులు.. టికెట్లను విచ్చలవిడిగా బుక్ చేస్తున్నారు. డే1 కోసం ఇప్పటి వరకు దాదాపు 8,35,850 టికెట్లు అమ్ముడైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కూలీకి తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 17.72 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా తెలిపాయి. రిలీజ్‌కు మరో రెండు రోజులు ఉండటంతో ఈ మొత్తం 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Coolie Singapore Company declared Holiday to Tamil Staff to Watch Rajinikanth s Movie

బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల విక్రయం
అయితే కూలీ తొలిరోజు టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అభిమానుల క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు పోటీపడుతున్నారు. ఒక్కో టికెట్ ధర 4500 రూపాయల వరకు అమ్ముడైందనే వార్తలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. రజనీకాంత్ నటించిన కూలీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే తపనతో ఉన్న అభిమానులకు ఈ ధరలు షాకిస్తున్నాయి. తమిళనాడులోనే కాకుండా కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఇదే పరిస్ధితి నెలకొంది.

టికెట్ ధర 4500 రూపాయలు
చెన్నైలోని ఓ ప్రముఖ థియేటర్‌ కూలీ రిలీజ్ రోజు టికెట్ ధరను రూ 4500 నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే పొల్లాచ్చిలోని ఓ థియేటర్ సిబ్బంది మొదటి రోజు టికెట్లను 400 రూపాయలకు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది తమిళనాడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ.. సింగిల్ స్క్రీన్లు ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నాయని తలైవా అభిమానులు మండిపడుతున్నారు.

సింగపూర్‌లో రజనీ మేనియా
ఇకపోతే.. రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగ రోజున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఎన్ని పనులున్నా సరే మానుకుని తొలిరోజు టికెట్ సంపాదించి సినిమా చూడాల్సిందే. ఆయన సినిమాలకు కంపెనీలు సెలవులు ప్రకటించడం, స్పెషల్ ఫ్లైట్స్‌పై బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం తెలిసిందే. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు చూసిందే. తాజాగా కూలీ రిలీజ్ సందర్భంగా సింగపూర్‌కు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఉద్యోగులకు సెలవు
రజనీ సినిమా వస్తుందంటే సింగపూర్‌లోని తమిళ కమ్యూనిటీ ఎలా సెలబ్రేట్ చేస్తుందో తెలిసిందే. అందుకే ఓ కంపెనీ తన తమిళ ఉద్యోగుల కోసం స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. కూలీ రిలీజ్ రోజున (ఆగస్ట్ 14న) హాలీడే డిక్లేర్ చేయడంతో పాటు కూలీకి ఫ్రీ టికెట్లను అందిస్తోంది. అంతేకాదు. థియేటర్‌లో చిరుతిండి, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికి 30 డాలర్లు చెల్లించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ కంపెనీపై తలైవా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X