twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా క్రైసిస్ ఛారిటీ.. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఎంతంటే?.. చిరు ట్వీట్ వైరల్

    |

    కరోనా ధాటికి సినీ పరిశ్రమ మూత పడి, షూటింగ్స్ జరగకపోవడం, పని లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలోకార్మికులు ఉన్నారు. వారి అవసరాలను తీర్చేందుకు, సినీ శ్రామికులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేశాడు. తన వంతుగా మొదట కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. తోటీ హీరోలను, నటీ నటులను కూడా సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చాడు.

    ఈ మేరకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) అంటూ స్థాపించి.. చిరు ఇచ్చిన పిలుపుకు భారీ ఎత్తున స్పందన వచ్చింది. టాలీవుడ్ మొత్తం కదలడంతో విరాళాలు వెల్లువల వచ్చాయి. ఇందులో భాగంగా నాగార్జున కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, ప్రభాస్ యాభై లక్షలు, రామ్ చరణ్ ముప్పై లక్షలు, ఎన్టీఆర్, మహేష్, నాగ చైతన్య 25 లక్షలు ఇలా ప్రతీ ఒక్క నటీనటుడు తమకు తోచిన సాయాన్ని ప్రకటించారు.

    Corona Crisis Charity Has 6.2 Crores Till Now

    సీసీసీకి విరాళాలు ఇచ్చిన ప్రతీ ఒక్కర్నీ పేరు పేరునా ప్రస్థావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపపుతూ వస్తున్నాడు. తాజాగా చిరు చేసిన ట్వీట్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా మారిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 6. 2 కోట్లు వచ్చాయని, మిగతా అందరూ తమకు తోచిన మొత్తాన్ని సాయంగా అందించాలని కోరాడు. ఈ మేరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కరోనా క్రైసిస్ ఛారిటీ స్పెషల్ సేవింగ్స్.. అకౌంట్ నెంబర్ అంటూ అన్ని వివరాలను పొందు పరిచాడు. అభిమానులు కూడా తమకు తోచిన మొత్తాన్ని ఆ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.

    English summary
    Corona Crisis Charity Has 6.2 Crores Till Now. Contributions may be sent to Chiranjeevi Charitable Trust - Corona Crisis Charity. Special Savings Acc # 0076 01 019951. IFSC Code : ICIC0000076. Branch Jubilee Hills, Hyderabad
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X