కరోనా ఎఫెక్ట్ : ‘మనసున్న మారాజు’ అనిపించుకున్న రాజశేఖర్

కరోనా వచ్చి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. పిట్టల్లా జనం రాలిపోతోన్న విరుగుడు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నా.. సాధ్యపడటం లేదు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

దేశంలో ఇప్పటికే కరోనా కేసులు 300 దాటాయి. మన రాష్ట్రంలో ఇరవైకి పైగా నమోదయ్యాయి. ఇలా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి 31వరకు షట్ డౌన్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించాడు. అంతకు ముందే టాలీవుడ్ మొత్తం స్వచ్చందంగా ముందుకు వచ్చి మార్చి 31 వరకు అన్ని కార్యకలాపాలను ఆపివేసింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోనే రోజూవారి కూలీలకు పూట గడవడం లేదు.

Corona Effect Dr Rajasekhar Helps to Daily Wage Workers In Tollywood

చిత్ర పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయం మూలంగా షూటింగ్ లు రద్దు కావడంతో ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులను ఆదుకునేందుకు హీరో రాజశేఖర్ ముందు వచ్చాడు. ఎవరికైనా ఎలాంటి సాయాన్నైనా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని, అవరసమైన వారు 9010810140 ఫోన్ చేయగలరని తెలిపాడు. దీంతో నిజంగానే మనసున్న మారాజు అంటూ ఆయన టైటిల్‌కు ఆయనకే ఆపాదిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X