twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభుత్వం అంగీక‌రిస్తే నేను రెడీ.. కమల్ హాసన్ సంచలన ప్రకటన

    |

    కోరలు చేస్తున్న కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తోంది. రోజు రోజుకూ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సినీ ప్రముఖులు సైతం అండగా నిలుస్తూ ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నారు. ఈ కోణంలోనే తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్.. తన ఇంటినే హాస్పిటల్ చేస్తా అంటూ సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి పోతే..

     జనతా కర్ఫ్యూ.. ఆ తర్వాత పరిస్థితులు

    జనతా కర్ఫ్యూ.. ఆ తర్వాత పరిస్థితులు

    కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ విధించి సక్సెస్ చేశారు నరేంద్ర మోడీ. కరోనా కట్టడికి కళ్లెం వేసేందుకు ప్రజలంతా సామాజిక దూరం పాటించడమే ఉత్తమ మార్గం అని మోడీ పేర్కొనడంతో ప్రజలంతా జనతా కర్ఫ్యూలో స్వచ్చందంగా పాల్గొన్నారు. అయినప్పటికీ కరోనా కంట్రోల్‌లో లేకపోవడంతో మరో మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించారు మోడీ.

     షూటింగ్స్ బంద్.. పేద కళాకారుల దుస్థితి

    షూటింగ్స్ బంద్.. పేద కళాకారుల దుస్థితి

    గత కొంతకాలంగా షూటింగ్స్ బంద్ కావడం, ఏప్రిల్ 15 దాకా లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా అప్పటిదాకా షూటింగ్స్ ప్రారంభానికి నోచుకోకపోవడం పేద కళాకారులను కలవరపెడుతోంది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కళాకారులు, సినీ కార్మికుల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇది గమనించిన సినీ తారలు పెద్దఎత్తున ముందుకొస్తూ అండగా నిలుస్తున్నారు.

    దక్షిణాది తారల సపోర్ట్..

    దక్షిణాది తారల సపోర్ట్..

    ఇప్పటికే రజినీకాంత్ తన వంతు సాయంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు సూర్య,కార్తి, విజయ్ సేతుపతి వంటి హీరోలు కూడా తమ వంతుగా రూ.10 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ నుంచి నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి గాను 20 లక్షలు ఆర్ధిక సాయం అందించారు.

    కరోనా కట్టడిలో వైద్యబృందాలు.. కమల్ నిర్ణయం

    కరోనా కట్టడిలో వైద్యబృందాలు.. కమల్ నిర్ణయం

    ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచ‌న‌లు చేస్తూ అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశాయి. మరోవైపు వైద్య సిబ్బంది, స‌హాయ‌క సిబ్బంది రేయింబవళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూ కరోనా కట్టడిలో భాగమవుతున్నారు. ఇందుకుగాను మెరుగైన వైద్య స‌దుపాయాలు, స్థ‌లం అవ‌స‌ర‌మ‌వుతున్నాయి. ఇది గుర్తించిన కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
    ప్రభుత్వం అంగీక‌రిస్తే రెడీ: కమల్ హాసన్

    ప్రభుత్వం అంగీక‌రిస్తే రెడీ: కమల్ హాసన్

    ఇప్పటికే క‌రోనా బాధితుల స‌హాయార్థం తమిళనాడు ప్రభుత్వానికి తన వంతుగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన కమల్ హాసన్.. మరో అడుగు ముందుకేసి తన హాస్పిటల్ చేస్తా అని పేర్కొనడం అభినందనీయం. ప్రభుత్వం అంగీక‌రిస్తే తేనాంపేట్‌లోని త‌న ఇంటిని హాస్పిట‌ల్‌గా మార్చి వైద్య సేవ‌లు అందించ‌డానికి అణువైన ప్ర‌దేశంగా చేస్తాన‌ని కమల్ హాసన్ ప్రకటించారు.

    English summary
    CoronaVirus effected thoughout india. Some of the cine stars given their donations to Governments for Corona treatments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X