పనికొస్తుందా? లేదా అనేది పక్కనబెడితే అలా ఉండటం ఇష్టముండదు: కాజల్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
సినిమా షూటింగ్ అన్నీ కూడా క్యాన్సిల్ కావడంతో సినీ తారలంతా ఇళ్లలోనే గడుపుతున్నారు. అందరూ తమ తమ ఇష్టమైన పనులను చేసుకుంటూ ఇంటి పరిసరాల్లోనే ఉంటున్నారు. అయితే తనకు ఖాళీగా ఉండటం ఇష్టం లేదని అంటోంది కాజల్ అగర్వాల్.

ఏ మాత్రం సమయం దొరికినా ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతానని, అయితే అది జీవితంలో తనకు పనికొస్తుందా? లేదా అనేది కూడా ఆలోచించనని అంటోంది కాజల్. సమయాన్ని వృథా చేయడం కంటే ఏదో ఒకటి నేర్చుకోవడం మంచిది కదా అనేది తన అభిప్రాయమని చెబుతోంది. ప్రస్తుతం తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిరంజీవి 152వ సినిమా 'ఆచార్య' లోనూ ఛాన్స్ పట్టేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్ పైకి మరికొద్ది రోజుల్లోనే వెళ్లనుంది కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications











