twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పదం విని మూడేళ్లు.. మనం ఓ స్క్రిప్ట్ రాస్తే దేవుడు మరొకటి రాస్తాడు.. మంచు మనోజ్ ఆవేదన

    |

    మంచు సినిమాల్లో నటించక చాలా రోజులే అవుతోంది. చివరగా ఒక్కడు మిగిలాడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఆయన చివరి చిత్రం. ఇప్పటికి మూడేళ్లు గడిచాయి.. తాజాగా ఓ ప్రాజెక్ట్‌కు పట్టాలెక్కించాడు. ఇంత గ్యాప్ రావడానికి వ్యక్తిగత జీవితమే కారణం. పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఒడిదుడుకులే సినీ రంగానికి దూరం చేశాయి.

    భార్యతో విడాకులు..

    భార్యతో విడాకులు..

    మంచు మనోజ్ తన భార్య ప్రణతికి విడాకులు ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ మేరకు ఎమోషనల్ అయిన మనోజ్.. ఇద్దరం ఓ అంగీకారానికి వచ్చే విడాకులు తీసుకుంటున్నామని, కలిసి బతకలేనప్పుడు విడిపోయి స్నేహితుల్లా ఉండాలనుకుంటున్నామని తెలిపాడు.

    సొంత ప్రొడక్షన్ హౌస్..

    సొంత ప్రొడక్షన్ హౌస్..

    వ్యక్తిగత జీవితంలోని బాధల వల్ల సినిమా రంగానికి దూరమైన మనోజ్.. సినిమానే తన జీవితంగా మలుచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు మంచు మనోజ్ ఆర్ట్స్‌ను స్థాపించి చిత్రాలను నిర్మించాలని అనుకున్నాడు. ఈ మేరకు అన్ని సిద్దం కూడా చేసుకున్నాడు.

    అట్టహాసంగా పూజా కార్యక్రమం..

    అట్టహాసంగా పూజా కార్యక్రమం..

    అహం బ్రహ్మాస్మి అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ఫస్ట్ లుక్ క్లిక్ అవ్వడంతో పూజాకార్యక్రమాలు అట్ట హాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్‌ను పిలిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే సినిమాను త్వరగా మొదలు పెట్టి ఫినిష్ చేయాలని ఆలోచించేలోపే కరోనా కాటు వేసింది.

    అంతా రివర్స్..

    అంతా సవ్యంగా ఉంటే.. అహం బ్రహ్మాస్మి చిత్రాన్ని ఈపాటికి మొదలెట్టేసేవాడు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో అంతా తారుమారైంది.ఇదే విషయాన్ని తెలుపుతూ మంచు మనోజ్ ఓ ట్వీట్ చేశాడు.

    ఆ పదం విని మూడేళ్లు

    ఆ పదం విని మూడేళ్లు

    తాజాగా సోషల్ మీడియాలో స్పందించిన మనోజ్.. ‘మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమా తో మిమ్మల్ని పలుకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. "యాక్షన్" అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడ'ని తెగ ఫీలయ్యాడు.

    Recommended Video

    Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
    అందరి కోసం ఓ పాట..

    అందరి కోసం ఓ పాట..

    కరోనా విజృంభిస్తున్న వేళ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వారందరి గుర్తుగా ఓ పాటను రిలీజ్ చేస్తామని చెబుతూ.. ‘వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు,
    ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను. అచ్చు మ్యూజిక్ డైరెక్షన్లో "అంతా బాగుంటాంరా" అని నేను, నా మేనకొడలు విద్యా నిర్వాణ కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది. ఇప్పటికే చాలా వాటికోసం ఎదురు చూస్తున్నారు. కష్టం అయినా వచ్చే వారం వరకూ అగండ'ని ట్వీట్ చేశాడు.

    English summary
    Corona Effect Manchu Manoj And Vidya Nirvana Special Song. Dedicating To Fighters Of Covid 19 Music Director Composing A New Song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X