కరోనా ఎఫెక్ట్: విమానాశ్రయంలో స్క్రీనింగ్.. టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ హౌస్ అరెస్ట్

అనుక్షణం భయం భయం.. ఎక్కడ ఏ వార్త సంచలనం సృష్టిస్తుందో అనే అనుమానం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కరోనా వైరస్ కోరలు చాస్తూ వీర విజృంభణ చేస్తుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఎలా బయటపడాలి? అనే దారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..

కరోనా ఎఫెక్ట్.. అంతా ఇంట్లోనే

కరోనా ఎఫెక్ట్.. అంతా ఇంట్లోనే

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడికక్కడ రద్దీ ప్రదేశాలు, ఆఫీసులు, సినిమా హాల్స్ క్లోజ్ చేసేశారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంట్లో నుంచే పనులు చేసేస్తున్నారు.

 అవగాహన కల్పించడంలో భాగంగా..

అవగాహన కల్పించడంలో భాగంగా..

ఈ క్రమంలో ప్రజల్లో ఉన్న భయం పోగొట్టి, కరోనా పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించేందుకు గాను పలువురు సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇదే బాటలో ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, సుమ లాంటి స్టార్స్ పలు జాగ్రత్తలు చెప్పారు.

 సెల్ఫ్ క్వారంటైన్‌.. కమెడియన్ ప్రియదర్శి

సెల్ఫ్ క్వారంటైన్‌.. కమెడియన్ ప్రియదర్శి

తాజాగా టాలీవుడ్ కమెడియన్ ప్రియదర్శి కూడా కరోనావైరస్ గురించి స్పందించారు. ముందుగా ప్రజల్లో అవగాహన తెచ్చేముందు తను ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ మధ్యే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్‌ జార్జియాలో పూర్తి చేసుకుని భారత్ తిరిగి వచ్చిన స్టార్ ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలిపారు.

 14రోజులు ప్రజలకు దూరంగా..

14రోజులు ప్రజలకు దూరంగా..

శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్క్రీనింగ్ అనంతరం ఇంట్లోనే ఉంటున్నారు ప్రియదర్శి. తనను తాను సెల్ఫ్ అరెస్టు చేసుకుని ఒక ప్రత్యేక గదిలో ఉండిపోయాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.

Recommended Video

Good News For Prabhas Fans, Radheshyam Movie First Look Date Fixed !

ప్రభాస్ 20.. ప్రియదర్శి

ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా రాబోతున్న కొత్త సినిమాలో ప్రియదర్శి నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసుకున్న యూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X