అల్లు అర్జున్-సుకుమార్ ప్రాజెక్ట్.. ఒకటి గుడ్, మరొకటి బ్యాడ్ న్యూస్.. అవి ఏంటంటే..?
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకు ఎదుగుతున్నాడు. నటనలోనూ మెట్యూరిటీ చూపిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. ప్రయోగాలు చేయడంలో ముందుండే బన్నీ.. సుకుమార్ సినిమాలో విభిన్నంగా కనిపించేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

కేరళలో షూటింగ్..
సుకుమార్ బన్నీ ప్రాజెక్ట్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టే బన్నీ లుక్‌పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు. లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ అదిరిపోయేలా ఉంటాడని టాక్ నడుస్తోంది.

బ్యాడ్ న్యూస్ అదే..
ప్రస్తుతం బన్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రారంభించాల్సి ఉంది. అయితే కేరళలో కరోనా విజృంభించడంతో అక్కడ అన్నీ మూతపడ్డాయి. థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు అన్నీ షట్ డౌన్ అయ్యాయి. ఈ క్రమంలోనే బన్నీ మూవీకి సంబంధించిన కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో షూటింగ్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.

ఒక గుడ్ న్యూస్ ..
అల వైకుంఠపురములో చిత్రానికి, సుకుమార్‌తో చేయబోయే సినిమాకు ఎంతో తేడా ఉంటుందని గీతా ఆర్ట్స్‌కు సంబంధించిన వ్యక్తి ట్వీట్ చేశాడు. సుకుమార్ సినిమాలో బన్నీ లుక్ అదిరిపోయేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

తాజాగా బన్నీ లుక్..
తాజాగా బన్నీ తన బాడీ గార్డ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుకలో పాల్గొన్న బన్నీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి గుబురు గడ్డంతో బన్నీ లుక్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











