పూజా హెగ్డే హౌస్ అరెస్ట్.. కారణం అదే!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వీర విజృంభణ చేస్తోంది. దీంతో జనం వణికిపోతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఎలా బయటపడాలి? అనే దారులు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే అందాల భామ, టాలీవుడ్ హీరోయిన్ కీలక నిర్ణయం తీసుకుంది.
సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో ఈ వైరస్ ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ ఆదేశాల మేరకు హీరోయిన్ పూజా హెగ్డే కూడా 14 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రభాస్- రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన పూజ తిరుగు ప్రయాణమైంది. ప్రస్తుతం అంతటా కరోనా భయాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఇంటికి వచ్చిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని పూజ అనుకుంటోందట.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది పూజా హెగ్డే. ''ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే నేను చేయబోయే మొదటి పని.. నన్ను నేను ఇంట్లో నిర్బంధించుకోవడం'' అని ఆమె పేర్కొంది. మరోవైపు కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను పెద్ద ఎత్తున సెలబ్రిటీలు స్పందిస్తుండటం స్వాగతించదగిన అంశం.


Click it and Unblock the Notifications











