సినీ కార్మికుల కోసం రోహిత్ శెట్టి.. 51 లక్షల భారీ విరాళం..
కరోనావైరస్ కారణంగా కుదేలైన సినీ కార్మికుల జీవితాలను ఆదుకోనేందుకు సినీ ప్రముఖులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ 25వేల మంది కార్మికులకు సహాయం అందిస్తుండగా.. దర్శకుడు రోహిత్ శెట్టి భారీగా విరాళం ప్రకటించారు. సినీ కార్మికుల కష్టాలను తీర్చాలని రూ.51 లక్షల విరాళం ఇచ్చారని సినీ ప్రముఖులు, వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షలు అశోక్ పండిట్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రోహిత్ శెట్టికి ధన్యవాదాలు తెలిపారు.
ఫెడరేషన్‌కు రూ.51 లక్షల విరాళంతో రోహిత్ శెట్టి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన ఎంతో మంది సినీ కార్మికుల హృదయాలను గెలుచుకొన్నారు. ప్రముఖులు అందిస్తున్న విరాళాలు సినిమా, టెలివిజన్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సహాయంగా ఉంటాయని భావిస్తున్నాను అని అశోక్ పేర్కొన్నారు.

రోహిత్ మాకు ఎప్పుడూ మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. ఎలాంటి అవసరం వచ్చినా.. మా అడగగానే మాకు సహాయం అందిస్తున్నారు. మా ఆశలను, ఆకాంక్షలను నీరు గార్చలేదు. భగవంతుడు మీమల్ని చల్లగా చూడాలని కోరుకొంటున్నాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











