కరోనా ఎఫెక్ట్: అనుష్క ఛాలెంజ్.. భలే ఆలోచనలే!
కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ మహమ్మారి వైరస్ ఒకరినుంచి ఒకరికి అంటుకోవడం కారణంగా జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నిదేశాల ప్రభుత్వాలు అలర్ట్ అయి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు రద్దీ ప్రదేశాల్లో జనం సంచరించకూడదని, పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ హీరోయిన్, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బుధవారం 'సేఫ్ హ్యాండ్' ఛాలెంజ్ పేరుతో సరికొత్త ఛాలెంజ్ విసిరింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు మేర సరికొత్త ఆలోచన చేసింది అనుష్క. ముందుజాగ్రత్త చర్యగా ఈ ముద్దుగుమ్మ తన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కొని 'సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్' విసరడం ఆసక్తికర అంశం.

సబ్బుతో తన చేతులు శుభ్రపరచుకున్న అనుష్క శర్మ.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా అందరూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని సలహా ఇచ్చింది. అంతకు ముందు బాలీవుడ్ మరో నటి దీపికా పడుకోన్ కూడా తన చేతులు కడిగి 'సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్' విరిసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ వచ్చిన ఛాలెంజ్‌లలో ఇది ఓ ఉపయోగకరమైన ఛాలెంజ్ అంటున్నారు విశ్లేషకులు.
View this post on Instagram#AnushkaSharma #Coronavirus #Covid19 #WHO #SafeHands
A post shared by Entertainment Fan Page (@facc2911) on


Click it and Unblock the Notifications











