ప్రభాస్ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌కి డబుల్.. రెబల్ స్టార్‌పై వెల్లువెత్తున్న కామెంట్స్
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యల్లో భాగం పంచుకుంటూ గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్. తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తూ గొప్పమనసు చాటుకుంటున్నారు. అటు కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ప్రభాస్ చేసిన ప్రకటన చూసి షాక్ అవుతున్నారు జనం. వివరాల్లోకి పోతే..
Recommended Video

కరోనా కల్లోలం.. లాక్‌డౌన్
కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఏ రోజుకారోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఏకైన మార్గమైన లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తోంది భారతదేశం. దేశ ప్రజలంతా ఏప్రిల్ 15 దాకా లాక్‌డౌన్ పాటించాలని ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు అందరూ ఇల్లు విడిచి బయటకు రావడం లేదు.

కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు.. మేమున్నాం అంటున్న సినీలోకం
కరోనా కట్టడి చేసేందుకు పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మరోవైపు రోజువారీ కూలీలు డబ్బులు లేక వివిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేద ప్రజల అవసరాలు తీర్చాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు టాలీవుడ్ సెలెబ్రిటీలు.

ప్రభుత్వానికి అండగా ప్రభాస్.. బాహుబలి చేతులంటే ప్రత్యేకమే!!
ఇప్పటికే నితిన్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, కొరటాల శివ, రామ్ చరణ్, అనిల్ రావిపూడి వంటి వారు తమ తమ ఆర్థిక సాయం ప్రకటించగా.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన వంతుగా ఏకంగా 4 కోట్ల రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నట్లుగా పేర్కొని సాయం చేయడంలోనూ ఇవి బాహుబలి చేతులే అని నిరూపించుకున్నారు.

సంచలన ప్రకటన.. ఏకంగా 4 కోట్లు
ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి కోటి రూపాయాల భారీ విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్.. ఆ తర్వాత ప్రధాన మంత్రి సహాయ నిధికి ఏకంగా 3 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ సంచలన ప్రకటన చూసి రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

రెబల్ స్టార్‌పై వెల్లువెత్తున్న కామెంట్స్
రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రానికి కలిపి పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇస్తే.. దానికి రెండింతలు విరాళం ప్రకటించి ప్రభాస్ సంచలనం సృష్టించారు. ప్రభాస్ గొప్పమనసు చూసి నెటిజన్లు ఫిదా అవుతూ పెద్దఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. వెండితెరపై అయినా, సాయం చేయడంలో అయినా రియల్ బాహుబలి మా ప్రభాస్ అన్న అంటూ తెగ పొగిడేస్తున్నారు.

ప్రభాస్, పూజా హెగ్డే.. హోమ్ క్వారంటైన్
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తిచేసిన చిత్రయూనిట్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తదుపరి షెడ్యూల్ వాయిదా వేసింది. ప్రభాస్, పూజా హెగ్డే తమకు తాము హోమ్ క్వారంటైన్ విదించుకున్నారు.


Click it and Unblock the Notifications











