కరోనా ఎఫెక్ట్ : అతిలోక సుందరి అలా.. రౌడీ స్టార్ ఇలా.. మొత్తానికి ఫుల్ ఎంజాయ్
కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మూగబోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే లక్షల మందికి కరోనా సోకగా.. వేలమందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. భారతదేశంలోనూ శరవేగంగా దూసుకుపోతోన్న కరోనా.. ఇప్పటికి మూడు వందల మందిని కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కరోనా ధాటిని తట్టుకోలేక ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు దేశం నేడు (మార్చి 22) జనతా కర్ఫ్యూను పాటిస్తోంది.

గొలుసును అరికట్టేందుకు..
కరోనా ఒకరిని నుంచి మరొకరికి సోకుతుండటంతో ఈ గొలుసును అరికట్టేందుకు పద్నాలుగు గంటలపాట స్వీయ నిర్భందం విధించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చాడు. వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలే కావడంతో.. పద్నాలుగు గంటలు ఇంటి పట్టునే ఉంటే.. కరోనాను నియంత్రించే అవకాశం ఉందని దేశ ప్రజలకు సూచించాడు.

అవగాహన కల్గించిన సెలెబ్రిటీలు..
జనతా కర్ఫ్యూపై అవగాహన కల్గించేందుకు సెలెబ్రిటీలందరూ ముందుకు వచ్చారు. అమితాబ్, ఆమీర్, సల్మాన్, అక్షయ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలు జనతా కర్ఫ్యూకు మద్దుతి తెలిపారు. ప్రజలంతా బాధ్యతగా మెలగాలని సూచించారు.
స్వీయ నిర్బందంలో స్టార్స్..
కరోనాను కట్టడి చేసేందుకు స్టార్స్ అందరూ స్వీయ నిర్భందాన్ని విధించుకున్నారు. షూటింగ్స్ అన్నింటిని రద్దు చేయడంతో అందరూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా వారు ఖాళీగా సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. తమలోని ప్రతిభను అభిమానులకు పరిచయం చేస్తున్నారు.
Recommended Video

అతిలోక సుందరి అలా.. రౌడీ ఇలా..
అతిలోక సుందరి జాన్వీ కపూర్ చిన్న పిల్లలా మారిపోయింది. కుంచె పట్ట రంగులేస్తుంది. పైనాపిల్ అంటే ఇష్టమని కష్టపడి దాని బొమ్మను గీసింది. ఈ క్రమంలో ఆమె మొహానికి రంగులు అంటాయి. పెయింటింగ్ వేసిన సంతోషంలో దిగిన సెల్ఫీని తాజాగా షేర్ చేసింది. మరోవైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. తన తమ్ముడితో కలిసి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి చదరంగం ఆడుతున్నారు.


Click it and Unblock the Notifications











