వెనక్కితగ్గిన అల్లు అర్జున్, చిరంజీవి.. ప్రభాస్ డేరింగ్ స్టెప్! రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దేశవిదేశాల్లో విహరిస్తూ, భారత దేశంలోనూ కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ డేరింగ్ స్టెప్ తీసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా స్టెప్? వివరాల్లోకి పోతే..

భయం భయం.. అన్నీ బంద్
ఒకరినుంచి ఒకరికి వేగంగా సోకే అవకాశం ఉండటంతో కరోనాను చూసి జంకుతున్నారు జనం. ముఖ్యంగా జన సమూహం ఉండే ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అలాంటి ప్రదేశాలపై ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. కొన్నిరోజుల పాటు సినిమా థియేటర్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ బంద్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి.

వాయిదాపడ్డ ఆచార్య.. చిరంజీవి కామెంట్స్
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు సినిమా షూటింగ్స్ కూడా వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం కూడా అవసరం అని చిరంజీవి పిలుపునిచ్చారు.

అల్లు అర్జున్‌కీ తప్పలేదు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ వేగం పెంచగానే కరోనా దాడి షురూ కావడంతో వాయిదా వేయకతప్పని పరిస్థితి నెలకొంది.

ప్రభాస్ స్పీడ్..
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ తన తాజా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా పూజ హెగ్డే నటిస్తుండగా, కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది.
Recommended Video

ఓ వైపు కరోనా.. ఎముకలు కొరికే చలి!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. యూనిట్ మొత్తం కూడా ఇటీవల జార్జియా వెళ్లి అక్కడ ఎముకలు కొరికే 10 డిగ్రీల చలి, వానలో కూడా షూటింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ ఇంతలా రాజ్యమేలుతుంటే.. ఇలా ప్రభాస్ యూనిట్ నిర్వహిస్తుండటం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











